Moviesగలీజ్ గా మాట్లాడేవాడు..భరించలేకపోయా..సంచలన విషయాలు బయట పెట్టిన నోయల్ మాజీ భార్య..!!

గలీజ్ గా మాట్లాడేవాడు..భరించలేకపోయా..సంచలన విషయాలు బయట పెట్టిన నోయల్ మాజీ భార్య..!!

సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని..మేము అలాంటి ప్రాబ్లంస్ ఫేస్ చేశామని ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు , క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పుతున్నా..పట్టించుకునే నాధుడే లేకపోయాడు. ఓ సినిమాలో అవకాశం రావలంటే ఖచ్చితంగా కమిట్ మెంట్ ఇవ్వాల్సిందే అని ఇప్పటికే చాలా మంది నటీమణులు చెప్పుకొచ్చారు. ఇక రీసెంట్ గా టాలీవుడ్ ప్రముఖ సింగర్, ర్యాపర్ బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ నోయల్ మాజీ భార్య ఈస్టర్ నోరోన్హా కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది.

సునీల్ నటించిన భీమవరం బుల్లోడు చిత్రంలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈస్టర్ నోరోన్హా .. ఆ తరువాత 1000 అబద్ధాలు, జయ జానకి నాయిక, గురం తదితర చిత్రాల్లో నటించింది. కానీ సరైన అవకాశాలు రాలేదు. ఎస్తేర్ ప్రస్తుతం కన్నడ, కొంకిని భాషల్లో బిజీ అయ్యారు. అయితే తెలుగు భాష రాకముందు తనకు తెలుగులో మంచి ఆఫర్లు వచ్చాయని ఇప్పుడు తెలుగు నేర్చుకున్న తరువాత ఆఫర్స్ తగ్గిపోయాయని అంటుంది ఈ భామ.

రీసెంట్ గా ఈ ఇంటర్వ్యుల్లో మాట్లాడుతూ.. తను సిని ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఫేస్ చేసిన ప్రాబ్లంస్ గురించి ఆ ఇంటర్వ్యుల్లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ..” ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో నన్ను చాలా మంది మీ పద్ధతి మార్చుకోమని చెప్పారు . నాకు అర్ధం కాలేదు. ఆ తరువాత మెల్లగా నన్ను మార్చడానికి ట్రై చేశారు. మీకు సినిమా అవకాశాలు వచ్చి హీరోయిన్ గా బాగా సెటిల్ అవ్వాలి అనుకుంటే..ఖచ్చితంగా మీరు డైరెక్టర్స్ అడిగింది చేయాలి అని పరోక్షం గా నాకు వాళ్ళ కోరికలను తీర్చాలి అని చెప్పారు.

అంతేకాదు గలీజ్ మాటలతో ఇబ్బంది పెట్టారు. కానీ నాకు ఆ కర్మ పట్టలేదు. నాకు డ్యాన్స్ , నటన అంటే ఇష్టం అందుకే హీరోయిన్ అవ్వాలి అనుకున్నా. కానీ ఇలాంటి వాటికి నేను అస్సలు ఒప్పుకోను. నేను ఇంట్లో డ్యాన్స్ చేసుకున్నా హ్యాపీగానే ఉంటా. కానీ ఇలా ఒకరి కొరికలు తీర్చి అవకాశాలు పొందాలి అనుకుంటే అలాంటి క్యారెక్టర్లు నాకు వద్దు” అంటూ గట్టిగానే చెప్పుకొచ్చింది. ఇక దీంతో మరోసారి క్యాస్టింగ్ కౌచ్ వివాదం హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news