Moviesరాధేశ్యామ్‌కు.. ప్ర‌భాస్ రియ‌ల్ లైఫ్‌కు లింక్ ఉందా.. (వీడియో)

రాధేశ్యామ్‌కు.. ప్ర‌భాస్ రియ‌ల్ లైఫ్‌కు లింక్ ఉందా.. (వీడియో)

టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న ఒక్కో హీరో పెళ్లి చేసుకుంటూ వ‌చ్చేస్తున్నాడు. గ‌తేడాది వ‌ర‌కు బ్యాచిల‌ర్ లిస్టులో ఉన్న రానా, నిఖిల్‌, నితిన్ ఓ ఇంటివాళ్లు అయిపోయారు. అయితే నాలుగు ప‌దుల వ‌య‌స్సుకు చేరువైన యంగ్‌రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ మాత్రం ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో ? కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. మీడియాలో ప్ర‌భాస్ పెళ్లిపై బాహుబ‌లి ది బిగినింగ్ త‌ర్వాత నుంచి కోకొల్ల‌లుగా వార్త‌లు వ‌స్తూనే ఉన్నాయి. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌భాస్ పెళ్లికి దూరంగానే ఉంటున్నాడు.

అయితే ప్ర‌భాస్ తాజా చిత్రం రాధేశ్యామ్‌. ఈ సినిమాలోనే పెళ్లి టాపిక్ ఉంది. అది ఈ రోజు రిలీజ్ అయిన గ్లింప్స్‌లో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్రేమికుల రోజు కానుక‌గా రాధేశ్యామ్ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో పూజా హెగ్డే – ప్ర‌భాస్ మ‌ధ్య ఉన్న కెమిస్ట్రీని మ‌రోసారి చూపించారు. చివ‌ర్లో ప్ర‌భాస్‌ను పూజా హెగ్డే వంట‌లు ఇంత బాగా వండుతావ్ .. బాగా మాట్లాడ‌తావ్‌… మ‌రి ఇంత మంచి అబ్బాయికి ఇంకా పెళ్లెందుకు కాలేదు ? అన్న డైలాగ్ వేస్తుంది.

ఇది ప్ర‌భాస్ రియ‌ల్ లైఫ్‌కు బాగా సూట్ అయ్యే ప్ర‌శ్న ? అయితే ఈ గ్లింప్స్ లో ప్ర‌భాస్ ఈ ప్ర‌శ్న‌కు ఏమ‌ని ఆన్స‌ర్ ఇచ్చాడ‌న్న‌ది మాత్రం రివీల్ చేయ‌లేదు. ఈ చిన్న స‌స్పెన్స్‌తో గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ ప్రేమికుల రోజుకు రాధేశ్యామ్ నుంచి ఫ‌ర్‌ఫెక్ట్ గ్లింప్స్ వ‌చ్చింది. ఈ గ్లింప్స్ వీడియోతోనే రాధేశ్యామ్ ప్ర‌చారం ప్రారంభించిన‌ట్టు ద‌ర్శ‌కుడు రాధాకృష్ణ కుమార్ ప్ర‌క‌టించారు.

రు. 250 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమా మార్చి 11న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. ప్రభాస్ ఇందులో చేయి చూసి జాతకాలు చెప్పే విక్రమాదిత్య పాత్రలో కనిపిస్తున్నాడు. కొన్ని ద‌శాబ్దాల క్రితం యూర‌ప్‌లో జ‌రిగిన ఓ య‌దార్థ చ‌రిత్ర ఆధారంగా ఈ సినిమా తెర‌కెక్కింద‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news