Moviesనాగార్జునతో ఆ సినిమా తీయ్యకపోయుంటే.. నాకు ఈ రోజు ఇలాంటి దుస్థితి...

నాగార్జునతో ఆ సినిమా తీయ్యకపోయుంటే.. నాకు ఈ రోజు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదు..జేకే సంచలన కామెంట్స్..!!

సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం.. మాయ లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందొ ఎవ్వరికి తెలియదు. నెడు స్టార్ గా ఉన్న వ్యక్తి రెపటికి రేపు జీరో గా మారిపోయే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలా జరిగిన సంధర్భాలు కూడా ఉన్నాయి. చాలా మంది ప్రముఖులు ఈ సినిమా ప్రప్రంచం మాయలో పడి డబ్బులు పొగొట్టుకుని..ఇప్పుడు బాధపడుతున్నారు. అలాంటి వారిలో ప్రముఖ భక్తి చిత్రాల రచయిత జేకే భారవి కూడా ఒకరు.

భక్తిరస ప్రధాన చిత్రాలకు భగవంతుడే పరవశించిపోయేలా ఆయన పలుకులు.. సరస్వతీ దేవి తన నాలుక మీద నాట్యమాడుతున్నట్లు ఆయన చేతుల్లో అక్షరాలు అలవోకగా రూపుదిద్దుకునేవి. అప్పత్లో రాఘవేంద్రరావు తెరకెక్కించిన భక్తి చిత్రాలతో రచయితగా జేకే భారవి పేరు మారుమ్రోగిపోయింది. అన్నమయ్య, రామదాసు, ఓం నమో వెంకటేశాయ, శ్రీ మంజునాథ వంటి ఎన్నో ఆధ్యాత్మిక చిత్రాలకు ప్రాణప్రతిష్ట చేసిన ఘనత ఆయనది. ఆ తరువాత మెల్లగా మరింతగా వెలుగులోకి వచ్చింది జేకే భారవి పేరు.

అప్పట్లో ఆయన ఎంతలా పాపులర్ అయ్యాడు అంటే..ఆ సమయంలో తెలుగు .. కన్నడ భాషల్లో ఎక్కడ చూసినా కూడా ఆయన పేరే ప్రధానంగా వినిపించేది. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రాలు తీసిన ఆయన ఒక్క సినిమాతో కుదేలయిపోయాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన… ప్రస్తుతం తాను ఉన్న పరిస్థితి గురించి ప్రస్తావిస్తూ సమచలన కామెంట్స్ చేసారు.

ఆయన మాట్లాడుతూ..” ఒక్కప్పుడు నా కెరియర్లో ఎన్నో కార్లు చూశాను తిరిగాన్య్ .. కానీ ఇదే రోజున నేను ఈ ఇంటర్వ్యూకి ‘ఓలా’ బైక్ పై వచ్చాను. అందుకు కారణం నేను నిర్మించిన ‘జగద్గురు ఆదిశంకర’ సినిమా.ఎన్నోఏళ్లుగా సంపాదించిందంతా ఒకే ఒక్క సినిమా జగద్గురు ఆదిశంకరతో పోయింది. నాగార్జున ప్రధాన పాత్రధారిగా జగద్గురు ఆదిశంకరాచార్య తీశాను. నా దగ్గర ఉన్నడబ్బులన్నీ కూడా ఆ సినిమాకే పెట్టేశా.. కానీ టైమ్ బాలేదు. ఆ సినిమా జనాలకి రీచ్ అవలేదు. ఫలితంగా నాకు ఇప్పుడు ఈ దుస్థితి వచ్చింది. నాకు అర్ధిక ఇబ్బందులు ఉన్నాయని చెప్పితే నాగార్జున కానీ రాఘవేంద్ర రావు కానీ హెల్ప్ చేస్తారు కానీ, అలా బ్రతకడం నాకు ఇష్టం లేదు.” అంటూ చెప్పుకొచ్చారు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news