Moviesఎన్టీఆర్ సినిమాలో నేనే హీరోయిన్‌ను... ప‌క్కా క్లారిటీ ఇచ్చేసిన క్రేజీ భామ‌..!

ఎన్టీఆర్ సినిమాలో నేనే హీరోయిన్‌ను… ప‌క్కా క్లారిటీ ఇచ్చేసిన క్రేజీ భామ‌..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన త్రిబుల్ ఆర్ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యి మార్చి 25న రిలీజ్‌కు రెడీగా ఉంది. రాజ‌మౌళి కాంబోలో ఎన్టీఆర్ న‌టిస్తోన్న నాలుగో సినిమా త్రిబుల్ ఆర్‌. ఈ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న సినిమా చేస్తున్నాడు. యువ‌సుధా ఆర్ట్స్ – ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ల సంయుక్త ఆధ్వ‌ర్యంలో మిక్కిలినేని సుధాక‌ర్ – నంద‌మూరి క‌ళ్యాణ్‌రామ్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తోన్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్‌లో తెర‌కెక్కించాల‌ని ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ క‌సితో ఉన్నారు.

కొర‌టాల ప్ర‌స్తుతం డైరెక్ట్ చేసిన మెగాస్టార్ చిరంజీవి ఆచార్య ఏప్రిల్ 1న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమా విజ‌యంపై కాన్ఫిడెంట్‌తో ఉన్న కొర‌టాల ఎన్టీఆర్ సినిమాను కూడా పాన్ ఇండియా రేంజ్‌లో సూప‌ర్ హిట్ చేయాల‌ని ఇప్ప‌టి నుంచే ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు. ఈ యేడాది ద‌స‌రాకు ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఆలియాభ‌ట్ హీరోయిన్‌గా న‌టిస్తుందంటూ కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

గ‌తంలో కొర‌టాల ఎన్టీఆర్ కాంబోలో వ‌చ్చిన జ‌న‌తా గ్యారేజ్ సూప‌ర్ హిట్ అయ్యింది. ఇప్పుడు మ‌రోసారి వీరి కాంబోలో సినిమా అన‌గానే భారీ అంచ‌నాలు ఉన్నాయి. దీంతో కొర‌టాల ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా ఈ సినిమాను ప్ర‌జెంట్ చేయాల‌ని చూస్తున్నాడు. ఇక పాన్ ఇండియా రేంజ్ విష‌యంలో ఏ మాత్రం అంచ‌నాలు త‌గ్గ‌కుండా ఉండేందుకే ఆలియాభ‌ట్‌ను హీరోయిన్‌గా తీసుకుంటున్నార‌ట‌. అయితే ఈ వార్త‌ల‌పై ఆలియా క్లారిటీ ఇచ్చేసింది.

ఆలియా తాజా సినిమా గంగూబాయి ప్రమోషన్స్ లో మీరు ఎన్టీఆర్ సినిమాలో న‌టిస్తున్నారట క‌దా ? అని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె ఆన్స‌ర్ ఇస్తూ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ త‌న‌ను అప్రోచ్ అయ్యింది నిజ‌మే అని చెప్పింది. తాను మ‌రోసారి ఎన్టీఆర్‌తో క‌లిసి ప‌ని చేస్తున్నాన‌ని క్లారిటీ ఇచ్చింది. ఆలియా స్వయంగా క్లారిటీ ఇవ్వ‌డంతో కొర‌టాల – ఎన్టీఆర్ ప్రాజెక్టులో ఆలియా హీరోయిన్ అన్న‌ది ఫిక్స్ అయిపోయింది. ఇక దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌డ‌మే ఆల‌స్యం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news