Moviesఒంటిపై పుట్టుమచ్చ‌లు ఎన్ని... చెంప ప‌గిలే ఆన్స‌ర్ ఇచ్చిన హీరోయిన్‌..!

ఒంటిపై పుట్టుమచ్చ‌లు ఎన్ని… చెంప ప‌గిలే ఆన్స‌ర్ ఇచ్చిన హీరోయిన్‌..!

మీడియాకు చాలా ప‌వ‌ర్ ఉంటుంది. మీడియా వాళ్లు త‌ల‌చుకుంటే తిమ్మిని బ‌మ్మిని చేస్తారు. అయితే త‌మ చేతిలో ప‌వ‌ర్ ఉంది క‌దా ? అని ఏది ప‌డితే అది మాట్లాడితే ఎవ్వ‌రూ స‌హించ‌రు. అది వెగ‌టు పుట్టిస్తోంది కూడా…! తాజాగా ఓ కొత్త సినిమా హీరోయిన్‌ను సినిమా రంగంలో సుధీర్ఘ‌కాలంగా అనుభ‌వం ఉన్న సీనియ‌ర్ పీఆర్వో ఒక‌రు ఆమె ఒంటిమీద పుట్టుమ‌చ్చ‌లు ఎన్ని అని అడిగిన ప్ర‌శ్న ఇప్పుడు అటు ఇండ‌స్ట్రీలోనూ.. ఇటు మీడియా వ‌ర్గాల్లోనూ చర్చ‌నీయాంశంగా మారింది.

విష‌యంలోకి వెళితే డీజే టిల్లు ట్రైల‌ర్ లాంఛ్ జ‌రిగింది. ఈ ట్రైల‌ర్‌లో ఓ డైలాగ్ ఉంది. హీరోయిన్ త‌న ఒంటిపై ఎన్ని పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయో చెపుతుంది. ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ పీఆర్వో, ఇటీవ‌లే జ‌ర్న‌లిస్టుగా మారిన కొండేటి సురేష్ హీరోయిన్ చేత 16 పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయి క‌దా.. అని చెప్పించారు క‌దా ? రియ‌ల్‌గా ఆ హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టు మ‌చ్చ‌లు ఉన్నాయో తెలుసుకున్నారా ? అని మైక్‌లోనే నేరుగా ప్ర‌శ్న వేశాడు.

దీంతో అక్క‌డున్న వారంతా ఒక్క‌సారిగా అవాక్క‌య్యారు. హీరో సిద్ధు అయితే ఈ ప్ర‌శ్న‌కు ఆన్స‌ర్ తాను ఎవాయిడ్ చేస్తున్నాన‌ని గౌర‌వ‌మైన ఆన్స‌ర్ ఇచ్చాడు. అయితే ఈ ప్ర‌శ్న అడిగిన సురేష్ కొండేటిని చాలా మంది నెటిజ‌న్లు ట్రోల్ చేస్తున్నారు. కొంద‌రు అయితే అస‌లు అత‌ను జ‌ర్న‌లిస్ట్ కాద‌ని అంటున్నారు. ఇటీవ‌ల ప్రెస్‌మీట్ల‌కు వ‌స్తోన్న ఆయ‌న కాంట్ర‌వ‌ర్సీ ప్ర‌శ్న‌ల‌తో వార్త‌ల్లో ఉంటున్నారు. త్రిబుల్ ఆర్ ప్రెస్‌మీట్లో కూడా రాజ‌మౌళితో సున్నం పెట్టుకుని సినీ మీడియా స‌ర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయ్యాడు.

అయితే ఈ ఎపిసోడ్‌లో బాధితురాలిగా మారిన హీరోయిన్ నేహాశెట్టి కూడా ఇదే అంశంపై స్పందించింది. ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో స‌ద‌రు సురేష్ వేసిన ప్ర‌శ్న చాలా దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని వాపోయింది. త‌న చుట్టూ ఉన్న మ‌హిళ‌ల‌కు, త‌న ఇంట్లో.. త‌న ఆఫీస్‌లో ఉన్న మ‌హిళ‌ల‌కు అతడు ఎలాంటి గౌర‌వం ఇస్తాడో ? ఈ ఘ‌ట‌న‌తోనే అర్థ‌మ‌వుతోంద‌ని చుర‌క‌లు వేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news