Moviesఎన్టీఆర్ బావ‌మ‌రిది సినిమాకు డిఫ‌రెంట్ టైటిల్‌... కొత్త‌గా ఉందే..!

ఎన్టీఆర్ బావ‌మ‌రిది సినిమాకు డిఫ‌రెంట్ టైటిల్‌… కొత్త‌గా ఉందే..!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి మ‌రో వెండితెర హీరో రాబోతున్నాడు. ఆయ‌న ఎవ‌రో కాదు ఎన్టీఆర్ బావ‌మరిది, ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త నార్నే శ్రీనివాస‌రావు కుమారుడు నితిన్ చంద్ర‌. ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తికి నితిన్ చంద్ర స్వ‌యానా త‌మ్ముడు. నితిన్ చంద్ర‌ను కొద్ది రోజులుగా హీరోను చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ఇందుకు సంబంధించి డ్యాన్సుల్లోనూ, ఫైట్ల‌లోనూ శిక్ష‌ణ కూడా ఇప్పిస్తున్నారు.

తేజ ద‌ర్శ‌క‌త్వంలో నితిన్‌ను ఇంట్ర‌డ్యూస్ చేయాల‌న్న ప్ర‌య‌త్నాలు కూడా జ‌రిగాయి. అయితే ఏదో తేడా రావ‌డంతో తేజ ఈ ప్రాజెక్టు నుంచి త‌ప్పుకున్నాడు. తేజ ప్ర‌స్తుతం ద‌గ్గుబాటి అభిరామ్ డెబ్యూ మూవీ అహింస‌ను తెర‌కెక్కిస్తున్నారు. ఇక నితిన్ చంద్ర కోసం శ‌త‌మానం భ‌వ‌తి ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగ్నేశ లైన్లోకి వ‌చ్చారు. శ‌త‌మానం భ‌వ‌తితో పాటు ప‌లు ఫ్యామిలీ క‌థ‌ల‌ను డీల్ చేసిన అనుభ‌వం ఉన్న స‌తీష్ ఇప్పుడు నితిన్ లాంచింగ్ మూవీ కోసం అదిరిపోయే ఫ్యామిలీ స‌బ్జెక్ట్ రెడీ చేశాడ‌ట‌.

 

ఫ్యామిలీ డ్రామాగా తెర‌కెక్కే ఈ సినిమాకు మూలం మ‌ళ‌యాళంలో హిట్ అయిన తీవండి. టోవినో థామ‌స్ న‌టించిన ఈ సినిమా అక్క‌డ సూప‌ర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ఆల్రెడీ అక్క‌డ హిట్ అయ్యి ఉండ‌డంతో పాటు ఫ్యామిలీ డ్రామా కావ‌డం.. హిట్ అయ్యే స్కోప్ ఎక్కువుగా ఉండ‌డంతో సేఫ్‌జోన్‌లో ఉండేందుకే ఈ క‌థ ఎంచుకున్నార‌ని అంటున్నారు. ఈ సినిమాకు శ్రీ శ్రీ రాజావారు అనే టైటిల్ ఫిక్స్ చేసిన‌ట్టు కూడా టాక్ ?

ఈ టైటిల్ అయితేనే ఈ క‌థ‌కు క‌రెక్టుగా మ్యాచ్ అవుతుంద‌ని చిత్ర యూనిట్ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది. మ‌ళ‌యాళ్ క‌థే అయినా తెలుగు నేటివిటీకి అనుగుణంగా చాలా మార్పులు చేశార‌ని.. మ‌రో శ‌త‌మానం భ‌వ‌తి అవ్వ‌డంతో పాటు నితిన్‌చంద్ర‌కు మాంచి లాంచింగ్ మూవీయే అవుతుంద‌న్న ధీమా అయితే ఉంది. క‌రోనా టైంలో షూటింగ్ స్టార్ట్ అవ్వ‌గా ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ ఫినిష్ చేసేశారు.

ఇక పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి చేసి త్వ‌ర‌లోనే రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాను నితిన్ చంద్ర తండ్రి నార్నే శ్రీనివాస‌రావు స్వ‌యంగా నిర్మించారు. ఇక ఎన్టీఆర్ ఎలాగూ ప్ర‌మోట్ చేస్తాడు. క‌థ‌లో కాస్త డెప్త్ ఉండి.. సినిమా జ‌నాల‌కు ఎక్కితే దానంత‌ట అదే ఆడేస్తుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ స‌పోర్ట్ కూడా ఫుల్‌గా ఉంటుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news