Moviesస‌మంత - సిద్ధార్థ్ విడిపోవ‌డానికి ముందే ఇంత కాంట్ర‌వ‌ర్సీ న‌డిచిందా..!

స‌మంత – సిద్ధార్థ్ విడిపోవ‌డానికి ముందే ఇంత కాంట్ర‌వ‌ర్సీ న‌డిచిందా..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత గ‌త ప‌దేళ్లుగా ఎప్పుడు మీడియాలో హైలెట్ అవుతూనే ఉంటోంది. ఆమె ఏం చేసినా సంచ‌ల‌న‌మే అవుతోంది. గ‌తంలో హీరో సిద్ధార్థ్‌తో ప్రేమాయ‌ణం, శ్రీకాళ‌హ‌స్తి ఆల‌యంలో రాహు, కేతు పూజ‌లు, ఆ త‌ర్వాత స్టార్ హీరోయిన్‌గా వ‌రుస పెట్టి స్టార్ హీరోల‌తో సూప‌ర్ హిట్లు కొట్ట‌డం.. ఆ త‌ర్వాత అక్కినేని హీరో చైతుతో ప్రేమాయ‌ణం.. పెళ్లి… నాలుగేళ్ల కాపురం త‌ర్వాత విడాకులు తీసుకుంది. విడాకులు తీసుకున్నాక ఆమె మ‌రింత‌గా రెచ్చిపోతోంది.

పుష్ప సినిమాలో చేసిన ఐటెం సాంగే ఆమె ఎలాంటి హ‌ద్దులు పెట్టుకోలేదు అనేందుకు నిద‌ర్శ‌నం. ఇక ఇప్పుడు ఆమె వ‌రుస పెట్టి తెలుగుతో పాటు అటు త‌మిళం, హిందీతో పాటు హాలీవుడ్లోనూ సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇక స‌మంత త‌న మాజీ ప్రియుడు సిద్ధార్థ్‌తో న‌టించిన జ‌బ‌ర్ద‌స్త్ సినిమా 9 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది. ఆ సినిమా షూటింగ్ టైంలో సిద్దార్థ్‌తో, స‌మంత పీక‌ల్లోతు ప్రేమ‌లో కూరుకుపోయింది. వీరు శ్రీకాళ‌హ‌స్తిలో జంట‌గా రాహు – కేతు పూజ‌లు చేయ‌డం కూడా అప్ప‌ట్లో ఓ సంచ‌ల‌నం అయ్యింది. వీరి ప్రేమ పెళ్లి వ‌ర‌కు వెళుతుంద‌నే అనుకున్నారు. కార‌ణాలు ఏవైనా సిద్ధార్థ్‌కు దూర‌మ‌య్యాకే ఆమె చైతుకు ద‌గ్గ‌రైంది.

ఇక జ‌బ‌ర్ద‌స్త్ సినిమా లెక్క‌లేన‌న్ని కాంట్ర‌వ‌ర్సీల‌కు కార‌ణ‌మైంది. అప్ప‌ట్లో సిద్ధార్థ్ – స‌మంత జంట‌కు క్రేజ్ ఉండ‌డంతో అలా మొద‌లైంది సినిమాతో హిట్ కొట్టి ఫామ్‌లో ఉన్న నందినీరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. టాలీవుడ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యాక బాలీవుడ్ మూవీ బ్యాండ్ బాజా బ‌రాత్ సినిమాకు కాపీగా ఉంద‌ని.. ద‌ర్శ‌కురాలు నందినీరెడ్డి ఆ సినిమాను మ‌క్కీకి మ‌క్కీ దించేసింద‌న్న విమర్శ‌లు వ‌చ్చాయి.

ఆ త‌ర్వాత బాలీవుడ్ నిర్మాత‌లు కోర్టుకు వెళ్ల‌డంతో కోర్టు ఈ సినిమాను టీవీల్లో, డీవీడీల్లో ప్ర‌సారం చేయ‌కూడ‌ద‌ని తీర్పు ఇచ్చింది. త‌ర్వాత నిర్మాత బెల్లంకొండ ఈ విష‌యాన్ని సెటిల్ చేసుకున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన కొంత కాలానికే సిద్ధార్థ్ – స‌మంత విడిపోయారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news