Moviesయంగ్ బ్యూటీతో హృతిక్ డేటింగ్‌... పీక‌ల్లోతు ల‌వ్‌లో మునిగారా...?

యంగ్ బ్యూటీతో హృతిక్ డేటింగ్‌… పీక‌ల్లోతు ల‌వ్‌లో మునిగారా…?

బాలీవుడ్‌లో రెండు ద‌శాబ్దాల క్రితం క‌హానా ఫ్యార్ హై సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన హృతిక్ రోష‌న్ తొలి సినిమాతోనే సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. అమీషా ప‌టేల్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమా అప్ప‌ట్లో దేశ‌వ్యాప్తంగా యూత్‌ను ఓ ఊపు ఊపేసింది. ఆ త‌ర్వాత క్రిష్ సీరిస్ సినిమాల‌తో తెలుగులో చిన్న పిల్ల‌ల‌కు కూడా హృతిక్ బాగా ద‌గ్గ‌రైపోయాడు. ఇక త‌న తొలి సినిమా రిలీజ్ అయిన టైంలో త‌న చిన్న‌నాటి స్నేహితురాలు అయిన సుసానే ఖాన్‌ను హృతిక్ ప్రేమ వివాహం చేసుకున్నాడు.

ఆమె ద‌ర్శ‌కుడు సంజ‌య్‌ఖాన్ ముద్దుల కుమార్తె. ఈ జంటకు ఇద్ద‌రు పిల్ల‌లు. ద‌శాబ్దంన్నర పాటు కాపురం చేశాక హృతిక్ త‌న భార్య సుసానేకు విడాకులు ఇచ్చాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవ‌డం హృతిక్ అభిమానుల‌కు ఏ మాత్రం న‌చ్చ‌లేదు. హృతిక్ ఫ్యామిలీ లైఫ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తాడు. అలాంటి హృతిక్ భార్య‌తో విడిపోవవ‌డం ఏంటో ఎవ్వ‌రికి అంతు ప‌ట్ట‌లేదు.

అయితే అంత‌కు ముందే హృతిక్ క్రిష్ సినిమాలో త‌న‌తో న‌టించిన కంగ‌నా ర‌నౌత్‌తో కూడా ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని.. ఆమెను పెళ్లి చేసుకునేందుకే భార్య‌కు విడాకులు ఇచ్చాడంటూ పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఆ త‌ర్వాత కంగ‌నా కూడా హృతిక్‌ను ఎన్నోసార్లు టార్గెట్ చేసింది. ఇక భార్య‌కు విడాకులు ఇచ్చినా కూడా హృతిక్ అప్పుడ‌ప్పుడు త‌న పిల్ల‌ల కోసం భార్య‌తో క‌లిసి విదేశీ టూర్లు వెళుతూనే ఉంటాడు.

ఇదిలా ఉంటే హృతిక్ మ‌రో యంగ్ బ్యూటీతో డేటింగ్‌లో ఉన్నాడ‌న్న ప్ర‌చారం ఇప్పుడు బీ టౌన్‌లో జోరుగా న‌డుస్తోంది. వారిద్ద‌రు క‌లిసి చెట్టా ప‌ట్టాలేసుకుని తిరుగుతుండ‌డంతో పాటు డిన్న‌ర్ల‌కు కూడా వెళుతున్నార‌ట‌. ఇటీవ‌ల ముంబైలోని ఓ రెస్టారెంట్ నుంచి హృతిక్ ఓ అమ్మాయితో డిన్న‌ర్ చేసి బ‌య‌ట‌కు వస్తోన్న ఫొటోలు లీక్ అయ్యాయి. అయితే ఆమె మాస్క్ పెట్టుకుని ఉండ‌డంతో ఎవరా ? అన్న‌ది పూర్తిగా క‌న‌ప‌డ‌డం లేదు.

అయితే ఆ యువ‌తి ఓటీటీతో గుర్తింపు పొందిన స‌బా ఆజాద్ అంటున్నారు. గ‌తేడాది నెట్ ఫ్లిక్స్‌లో ప్ర‌సార‌మైన ఆంథాల‌జీ ఫీల్స్ లైక్ ఇష్క్ లో స‌బా న‌టించారు. ఆమె – హృతిక్ ఇద్ద‌రూ క‌లిసి పీక‌ల్లోతు ప్రేమ‌లో ఉన్నార‌ని.. వీరు సీక్రెట్‌గా డేటింగ్ కూడా చేస్తున్నార‌న్న ప్ర‌చారం అయితే బీటౌన్‌లో ఒక్క‌సారిగా గుప్పుమంటోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news