Moviesఆ హీరోలు దానికి పనికిరారు ..ఎప్పుడు మేమే చేయాలి..బాలీవుడ్ బ్యూటీ ఓపెన్...

ఆ హీరోలు దానికి పనికిరారు ..ఎప్పుడు మేమే చేయాలి..బాలీవుడ్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్..!!

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే ఒక్కో హీరో కోట్లలల్లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయినా తమ రెమ్యూనరేషన్లను మాత్రం పెంచుకుంటూ పోతున్నారు స్టార్ హీరోలు. నిజానికి జ‌యాప‌జ‌యాల‌ను బ‌ట్టి పారితోషి‌కం విలువ‌ల్లో కూడా మార్పుచేర్పులు జరుగుతూ ఉంటాయి. కానీ ఒక్క‌సారి స్టార్ క్రేజ్ సంపాదించుకున్న త‌ర్వాత సినిమా హిట్ట‌యినా, ఫ‌ట్ట‌యినా పారితోషి‌కం పెరుగుతూ ఉంటుందే త‌ప్ప త‌రుగుదల మాత్రం ఉండ‌దు. అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు అందరు హీరోలు.

అయితే , హీరోయిన్ల రెమ్యూనరేషన్ల విషయానికి వచ్చేసరికి..డైరెక్టర్స్ నిర్మాతలు దారుణంగా ఆలోచిస్తున్నారు. ఓ పాన్ ఇండియా సినిమాలో హీరోగా చేస్తే..70 , 80 కోట్లు తీసుకుంటున్నారు. ఇక అదే సినిమాలో హీరోయిన్ గా చేసే వాళ్లకి మాత్రం 3-4 కోట్లకు మించి ఇవ్వడం లేదు. రెమ్యూనరేషన్ల విషయంలో మరీ ఇంత వ్యత్యాసమా అని పలువురు హీరోయిన్లు నోరు విప్పి అడుతున్నా..పట్టించుకునే నాధుడే లేడు. మరోసారి ఇలాంటి విషయానే లేవనెట్టి షాకింగ్ కామెంట్స్ చేసింది బాలీవుడ్ బ్యూటీ భూమి పెడ్నేకర్.

భూమి పెడ్నేకర్.. ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేదు. బాలీవుడ్ బ్యూటీ అయినా భూమి పెడ్నేకర్ గురించి తెలిసిన ప్రతి ఒక్కరు వావ్ అంటారు. నటనతో పాటు అందాల ఆరబోతలో కూడా భూమి ఎప్పుడూ ముందే ఉంటుంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ ఫోటోషూట్స్ పెడుతూ పిచ్చెక్కిస్తుంటుంది భూమి. దమ్ లగా కే ఐసా సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ మొదటి సినిమాలో 130 కేజీల బరువుతో కనిపించింది. అయితే ఆతర్వాత ఏకంగా ఒకేసారి 60 కేజీలు తగ్గిపోయి నాజూగ్గా మారిపోయి హాట్ ఫోటోలతో కుర్రాళ్ళ మతిపోగొడుతుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిత్ర పరిశ్రమలో పారితోషక డిఫరెన్స్ ల సమస్య గురించి షాకింగ్ కామెంట్స్ చెసారు.

కోవిడ్ టైంలో హీరోయిన్ల రెమ్యునరేషన్ గురించి భూమి ఘాటు వ్యాఖ్యలు చేసింది. కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీతం తగ్గించుకోండి అని నిర్మాతలు హీరోయిన్లకు చెప్పి కోతలు విధించారే కానీ..ఎక్కడా కూడా స్టార్ హీరోలకు రెమ్యునరేషన్ తగ్గించి ఇవ్వలేది. కొరోనా వల్ల నష్టాలు ఎదురవుతున్నాయని.. చెప్పి మా పొట్ట కొట్టారే కానీ హీరో ల రెమ్యునరేషన్ తగ్గించుకోమని ఏ డైరెక్టర్ ఏ నిర్మాత ఏ హీరో కి చెప్పాలేదు.

ఎందుకంటే హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని చెప్పే ధైర్యం నిర్మాతలకు లేదు. ఇదెక్కడి న్యాయం. ప్రతిసారి హీరోయిన్లని మాత్రమే బలిచేస్తారు అంటూ ఆరోపించింది. ఇది చాలా విచిత్రమైన పరిస్థితిగా ఉంది అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పోలిస్తే హీరోయిన్లకు ఇచ్చే రెమ్యూనరేషన్ తక్కువే. మరి అందులోనూ తగ్గించుకోమని అడగడం నిజంగా హాస్యాస్పదమే అంటున్నారు నెటిజన్స్. మరి చూడాలి భూమి పెడ్నేకర్ ఆరోపణలపై నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news