Moviesఅజిత్ ' వ‌లిమై ' కు ఏపీలో బిగ్ షాక్‌.. కావాల‌ని...

అజిత్ ‘ వ‌లిమై ‘ కు ఏపీలో బిగ్ షాక్‌.. కావాల‌ని దెబ్బేశారా…!

కోవిడ్ ఎఫెక్ట్‌తో చాలా పెద్ద సినిమాలు రిలీజ్‌లు కూడా ఆగిపోతున్నాయి. దీంతో ఇప్పుడు వ‌రుస పెట్టి సినిమాల మీద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు కూడా ఇప్పుడు వ‌రుస పెట్టి వ‌స్తుండ‌డంతో పెద్ద సినిమాలు అన్నీ ఒకేసారి వ‌రుస పెట్టి థియేట‌ర్ల‌లోకి వ‌స్తున్నాయి. సంక్రాంతికి రావాల్సిన రాధేశ్యామ్‌, త్రిబుల్ ఆర్ సినిమాల డేట్లు వాయిదా ప‌డ‌డంతో ఆ త‌ర్వాత రావాల్సిన పెద్ద సినిమాల రిలీజ్ డేట్ల‌ను సైతం వాయిదా వేస్తున్నారు.

దీనికి తోడు ఇత‌ర భాష‌ల్లో తెర‌కెక్కిన భారీ పాన్ ఇండియా సినిమాలు, డ‌బ్బింగ్ సినిమాలు కూడా ఇప్పుడే రిలీజ్ అవుతున్నాయి. దీంతో పెద్ద సినిమాల‌కు కూడా ఎప్పుడూ లేనంత‌గా థియేటర్ల స‌మ‌స్య త‌లెత్తింది. తాజాగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ న‌టిస్తోన్న వ‌లిమై సినిమాకు ఇప్పుడు ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యుస‌ర్ బోనీక‌పూర్ చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమా నిర్మించారు.

 

యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాకు ఖాకీ, నేర్కొండ పార్వై (పింక్ రీమేక్‌) సినిమాల‌ను డైరెక్ట్ చేసిన హెచ్‌. వినోద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 24న ఈ సినిమా తెలుగు, త‌మిళ్ భాష‌ల్లో రిలీజ్ చేస్తున్నారు. చాలా రేసీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తుంటేనే మ‌తులు పోతున్నాయి. ఈ సినిమాతోనే టాలీవుడ్ యంగ్ హీరో కార్తీకేయ గుమ్మంకొండ త‌మిళ తెర‌కు హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు.

మ‌హేష్‌బాబు రిలీజ్ చేసిన ట్రైల‌ర్ క‌ళ్లుచెదిరిపోయేలా ఉంది. హీరో అజిత్‌కు పోటీగా కార్తీకేయ క్యారెక్ట‌ర్‌ను ద‌ర్శ‌కుడు మ‌లిచిన తీరుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తెలుగుతో పాటు త‌మిళంలోనూ ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో చెప్ప‌క్కర్లేదు. కార్తీకేయ సైతం ఈ సినిమాతో త‌న మార్కెట్ పెరుగుతుంద‌న్న ఆశ‌ల‌తో ఉన్నాడు. ఈ నెల 24న వ‌స్తోన్న ఈ సినిమాకు ఏపీలో థియేట‌ర్లు ఇవ్వ‌డం లేద‌ట‌. ఇది ఆ సినిమాకు బిగ్ షాక్ అనే చెప్పాలి.

ఫిబ్ర‌వ‌రి 25న ఇద్ద‌రు మెగా హీరోలు ప‌వ‌న్ క‌ళ్యాణ్ భీమ్లానాయ‌క్‌, వ‌రుణ్‌తేజ్ గ‌నితో పాటు శ‌ర్వానంద్ సినిమా కూడా ఉంది. ఈ మూడు సినిమాల‌కే స‌రైన రేంజ్‌లో థియేట‌ర్లు దొర‌క్క కొట్టుకుంటున్నారు. ఈ టైంలో అజిత్ సినిమా కూడా వ‌స్తుండ‌డంతో థియేట‌ర్లు ఇచ్చేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేద‌ట‌. ఏదేమైనా రిలీజ్‌కు ముందే ఇది అజిత్‌కు పెద్ద షాక్ అని చెప్పాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news