Moviesప‌వ‌న్ రికార్డుల వేట‌... యూఎస్‌లో భీమ్లానాయ‌క్ స‌రికొత్త రికార్డు ..!

ప‌వ‌న్ రికార్డుల వేట‌… యూఎస్‌లో భీమ్లానాయ‌క్ స‌రికొత్త రికార్డు ..!

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓవ‌ర్సీస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌లో టాప్ – 10 లిస్టులోకి నేరుగా చేరిపోయింది. విచిత్రం ఏంటంటే ఇటీవ‌ల రిలీజ్ అయ్యి సూప‌ర్ హిట్ అయిన అల్లు అర్జున్ పుష్ప కూడా ఈ స్థాయి వ‌సూళ్లు చేరుకోలేక‌పోయింది. భీమ్లానాయ‌క్ సినిమాపై భారీ అంచ‌నాలు ఉండ‌డంతో పాటు అటు ద‌గ్గుబాటి రానా కూడా ఉండ‌డంతో యూఎస్‌లో ఎక్కువ మంది ప్రీమియ‌ర్ షో చూసేందుకు ఆస‌క్తి క‌న‌ప‌రిచారు.

కేవ‌లం ప్రీమియ‌ర్ల‌తోనే ఈ సినిమా అక్క‌డ 8. 58 ల‌క్ష‌ల డాల‌ర్ల‌ను వ‌సూలు చేసింది. దీంతో టాప్ – 10 యూఎస్ ప్రీమియ‌ర్ల‌తో 7వ స్థానంలోకి చేరుకుంది. ఈ క్ర‌మంలోనే సైరా – భ‌ర‌త్ అనే నేను – అల వైకుంఠ‌పురంలో సినిమాల‌ను కూడా వెన‌క్కు నెట్టేసింది. ఓ వైపు థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కుల‌ను ర‌ప్పించేందుకు చాలా సినిమాలు నానా తంటాలు ప‌డుతున్నాయి.

ఇలాంటి టైంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిలీజ్ మొద‌టి రోజు నుంచే రికార్డుల వేట స్టార్ట్ చేశాడు. ఇక మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప‌నుం కోషియ‌మ్ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయ‌క్ తెర‌కెక్కింది. విచిత్రం ఏంటంటే ఫ‌స్ట్ ట్రైల‌ర్ రిలీజ్ అయిన‌ప్పుడు కూడా భీమ్లానాయ‌క్‌పై ఎలాంటి సంచ‌ల‌నాలు లేవు. అలాంటిది ఇప్పుడు సినిమాకు మొద‌టి ఆట నుంచి మంచి టాక్ వ‌చ్చింది.

ఓవ‌రాల్‌గా చూస్తే భీమ్లానాయ‌క్ వ‌సూళ్ల ప‌రంగా స‌రికొత్త రికార్డులు క్రియేట్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. సితార ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాకు సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిచారు. థ‌మ‌న్ సంగీతం అందిచ‌గా.. నిత్యామీన‌న్‌, సంయుక్త మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు.

ఇక యూఎస్‌లో టాప్-10 ప్రీమియర్స్ వ‌సూళ్ల లిస్ట్ ఇలా ఉంది…( డాలర్ల‌లో)

1- బాహుబలి 2 : $4,517,704

2- అజ్ఞాతవాసి : $1,521,438

3- బాహుబలి : $1,364,416

4- ఖైదీ నంబర్ 150 : $1,295,613

5- స్పైడర్ : $1,005,630

6- సాహో : $9,15,224

7- భీమ్లానాయక్ : $858000

8- సైరా : $8,57,765

9- భరత్ అనే నేను : 850k (మొదటి రోజు – 1.4 Million)

10- అల వైకుంఠపురములో : $8,09,072

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news