Moviesవిజ‌య‌వాడ అల్లుడు అవుతోన్న అఖిల్‌... ముహూర్త‌మే త‌రువాయి...!

విజ‌య‌వాడ అల్లుడు అవుతోన్న అఖిల్‌… ముహూర్త‌మే త‌రువాయి…!

టాలీవుడ్ కింగ్ నాగార్జున వార‌సుడిగా వెండితెర‌పైకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అక్కినేని అఖిల్‌. నాగార్జున – అమ‌ల ముద్దుల త‌న‌యుడు అయిన అఖిల్ చిన్న‌ప్పుడే సింసింద్రీ సినిమాతో వెండితెర‌పై ఎన్నో సంచ‌ల‌నాలు క్రియేట్ చేశాడు. ఆ త‌ర్వాత అఖిల్.. అఖిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హాలో, మిస్ట‌ర్ మ‌జ్ను సినిమాలు ప్లాప్ అయినా.. మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్ సినిమాతో ఎట్ట‌కేల‌కు తొలి హిట్ కొట్టాడు.

ఇక ఇప్పుడు ఏజెంట్ సినిమా చేస్తున్నాడు. సురేంద‌ర్‌రెడ్డి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా యాక్ష‌న్‌, థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతోంది. ఇక నాగార్జున ఇద్ద‌రు త‌న‌యుల పెళ్లిళ్లు క‌లిసి రాలేదు. పెద్ద కుమారుడు నాగ‌చైత‌న్య‌, స్టార్ హీరోయిన్ స‌మంత‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. 2017లో పెద్దల సమక్షంలో అంగరంగ వైభవంగా వీరి వివాహం జ‌రిగింది. అయితే వీరి వైవాహిక బంధం ఎక్కువ కాలం నిల‌వ‌లేదు.

నాలుగేళ్ల కాపురం త‌ర్వాత గ‌త నవంబ‌ర్‌లో చైతు – స‌మంత దంప‌తులు విడిపోయారు. ఇక స‌మంత – చైతు పెళ్లి కంటే ముందు అఖిల్‌కు పెళ్లి చేసేయాల‌ని నాగార్జున – అమ‌ల డిసైడ్ అయ్యారు. అంత‌కుముందే అఖిల్ జీవీకే గ్రూప్ సంస్థ‌ల అధినేత జీవీ రెడ్డి మ‌న‌వ‌రాలు శ్రియాభూపాల్‌ను ప్రేమించారు. వీరి ఎంగేజ్‌మెంట్ చాలా గ్రాండ్‌గా జ‌రిగింది.

ఇట‌లీలో వీరి పెళ్లి అంగ‌రంగ‌వైభ‌వంగా జ‌రిపించేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ఓ ఫంక్ష‌న్‌లో అఖిల్ – శ్రియ మ‌ధ్య చిన్న గొడ‌వ కాస్త అక్కినేని ఫ్యామిలీ, నాగార్జున ఇగో హ‌ర్ట్ అయ్యేందుకు కార‌ణం కావ‌డంతో వీరి పెళ్లి ఎంగేజ్‌మెంట్‌తోనే క్యాన్సిల్ అయ్యింది. ఆ త‌ర్వాత శ్రియాకు చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వ‌ర్‌రెడ్డి – సంగీత త‌న‌యుడితో పెళ్లి అయిపోయింది. ఇంకా అఖిల్‌కు పెళ్లికాలేదు.

ప్ర‌స్తుతం నాగార్జున ఇద్ద‌రు కుమారులు ఒంట‌రి జీవితాన్నే గ‌డుపుతున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు త‌న కొడుకుల‌కు మ‌ళ్లీ పెళ్లి చేసే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. చైతు పెళ్లికి కాస్త టైం ప‌ట్టేలా ఉంది. అయితే అఖిల్‌కు మాత్రం త్వ‌ర‌లోనే పెళ్లి చేసేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. విజ‌య‌వాడ‌కు చెందిన త‌న సామాజిక వ‌ర్గానికే చెందిన అమ్మాయితో అఖిల్ పెళ్లి నిశ్చ‌మైన‌ట్టు తెలిసింది.

రెండు కుటుంబాల వారు ఈ పెళ్లికి దాదాపు అంగీకారానికి వ‌చ్చిన‌ట్టు కూడా ఇండ‌స్ట్రీలో అక్కినేని కుటుంబ స‌న్నిహితుల నుంచి స‌మాచారం వ‌చ్చింది. చైతు – స‌మంత బంధం విచ్ఛిన్నం కావ‌డంతో అఖిల్ పెళ్లి విష‌యంలో నాగార్జున చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. అఖిల్ భార్య ఇండ‌స్ట్రీలో ఏ మాత్రం సంబంధం లేకుండా ఉండాల‌ని బ‌లంగా డిసైడ్ అయ్యాడ‌ట‌.

అందుకే ప‌లు సంబంధాలు చూసి చివ‌ర‌కు విజ‌య‌వాడ‌లో సంప్ర‌దాయ కుటుంబానికి చెందిన అమ్మాయినే త‌న కోడలిగా తెచ్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ఈ స‌మ్మ‌ర్ త‌ర్వాత లేదా ఏజెంట్ షూటింగ్ కంప్లీట్ అయిన వెంట‌నే అఖిల్ పెళ్లి ఉండొచ్చ‌ని టాక్ ?

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news