Moviesమ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లిగా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ‌...!

మ‌హేష్‌బాబు మ‌ర‌ద‌లిగా ఛాన్స్ కొట్టేసిన ముద్దుగుమ్మ‌…!

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు ప్ర‌స్తుతం వ‌రుస‌పెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఇప్ప‌టికే హ్యాట్రిక్ హిట్లు కొట్టిన మ‌హేష్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారువారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్‌గా చేస్తోన్న ఈ సినిమా పొలిటిక‌ల్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుంది. స‌మ్మ‌ర్‌లో రిలీజ్ చేయాల‌ని చూస్తున్నారు. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మ‌హేష్‌, త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ రూపొందించే సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 2010లో వ‌చ్చిన ఖ‌లేజా సినిమా త‌ర్వాత 12 ఏళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌రోసారి మహేష్ – త్రివిక్ర‌మ్ క‌లిసి ప‌ని చేస్తున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ – త్రివిక్ర‌మ్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ సినిమాలో మ‌హేష్ ప‌క్క‌న హీరోయిన్‌గా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేను ఇప్ప‌టికే ఫైన‌లైజ్ చేశారు. పూజ – మ‌హేష్ క‌లిసి ఇప్ప‌టికే మ‌హ‌ర్షి చేశారు. ఆ సినిమా సూప‌ర్ హిట్ అయ్యింది. మ‌రోసారి వీరి కాంబో రిపీట్ అవుతుండ‌డంతో పాటు క్రేజీ జంట కావ‌డంతో సినిమాకు ప్ల‌స్ కానుంద‌న్న అంచ‌నాలు ఉన్నాయి. ఈ టైంలో ఈ సినిమా గురించి మ‌రో అదిరిపోయే అప్‌డేట్ వ‌చ్చింది.

ఈ సినిమాలో మ‌హేష్ మ‌ర‌ద‌లు రోల్‌కు చాలా ప్రాధాన్యం ఉంటుంద‌ట‌. సినిమాలో మ‌హేష్‌ను ఆట‌ప‌ట్టించ‌డంతో పాటు మ‌హేష్ ప్రేమ‌లో కీల‌కంగా ఉండే రోల్‌గా ఆ మ‌ర‌ద‌లి రోల్ ఉండేలా త్రివిక్ర‌మ్ డిజైన్ చేశాడ‌ట‌. ఈ పాత్ర కోసం ప‌లువురు పేర్లు ప‌రిశీలించి చివ‌ర‌కు మ‌ళ‌యాళ ముద్దుగుమ్మ సంయుక్త‌మీన‌న్‌ను ఫైన‌లైజ్ చేశార‌ని తెలుస్తోంది. సంయుక్త ఇప్ప‌టికే సాగ‌ర్ కె. చంద్ర ద‌ర్శ‌క‌త్వంలో ప‌వ‌న్ – రానా హీరోలుగా న‌టిస్తోన్న భీమ్లానాయ‌క్ సినిమాలో రానా భార్య‌గా న‌టిస్తోంది.

ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌తో పాటు స్క్రీన్‌ప్లే, మాట‌లు కూడా త్రివిక్ర‌మ్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఆమె న‌ట‌న చూసిన త్రివిక్ర‌మ్ ఇక్క‌డ మ‌హేష్ మ‌ర‌ద‌లిగా ఆమెనే సెల‌క్ట్ చేసుకున్నార‌ట‌. మొత్తానికి త్రివిక్ర‌మ్ కంట్లో ప‌డిన మ‌హేష్ మ‌ర‌ద‌లు కెరీర్ ఎలా ట‌ర్న్ అవుతుందో ? చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news