Moviesవ‌రుణ్ సందేశ్ - వితిక పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డానికి అదే కార‌ణమా..!

వ‌రుణ్ సందేశ్ – వితిక పిల్ల‌ల్ని క‌న‌క‌పోవ‌డానికి అదే కార‌ణమా..!

వరుణ్ సందేశ్ పదేళ్ల క్రితం ఒక‌టి, రెండు సూపర్ హిట్ సినిమాలతో యూత్ లో బాగా పాపులర్ అయ్యాడు. దిల్ రాజు బ్యానర్‌లో వచ్చిన కొత్త బంగారులోకం సినిమాతో ఒక్కసారిగా స్టార్ డం సొంతం చేసుకున్న వరుణ్ ఆ తర్వాత కెరీర్ పరంగా వేసిన స్టెప్పులతో వెనుకబడి పోయాడు. సరైన కథాబలం ఉన్న సినిమాలు ఎంచుకోక పోవడంతో వరుసపెట్టి ప్లాపులు పలకరించాయి. దీంతో రేసులో వెనుకబడి పోయాడు. ఈ క్రమంలోనే తనతో కలిసి హీరోయిన్‌గా నటించిన భీమవరం అమ్మాయి వితికా షెరును వరుణ్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ త్రీలో పాల్గొన్న ఈ జంటకు మంచి పాపులారిటీ వచ్చింది.

విచిత్రం ఏంటంటే వితిక‌కు హీరోయిన్ గా చేసినప్పుడు లేని పాపులారిటీ బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లి వచ్చాక వచ్చింది. బిగ్ బాస్ షో తర్వాత ప‌లు షోల‌కు ఆమె యాంకర్ గా కూడా పని చేశారు. అయితే ఆమె యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగానే సంపాదిస్తోంది. ఈ క్రమంలోనే తన తాజా ఇంటర్వ్యూలో పిల్లల గురించి కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈ జంట. సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా ఎప్పుడూ ఒకేలా ఉండాలి అని చెప్పిన వరుణ్… ఏ రంగంలో అయినా పరిస్థితులవల్ల ఎదుటి వ్యక్తుల ప్రవర్తన లో మార్పు వస్తుందని చెప్పాడు. లైఫ్ అనేది కంటిన్యూగా సాగుతూ ఉంటుందని… అయితే దానిని మనం ఎప్పుడూ బెస్ట్ గా తీసుకోవాలని వ‌రుణ్‌ సూచించాడు.

ఇక వరుసగా తన సినిమాలు పరాజయం పాలవడంపై స్పందిస్తూ కొన్ని సినిమాలు సరిగ్గా ప్రమోషన్లు కూడా లేకుండా రిలీజ్ అయ్యాయని వెల్లడించాడు. ఇక తన భార్య వితిక డిజైనింగ్ కూడా చేస్తుందని…. యూట్యూబ్ ఛానల్ ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తుంది అని పరోక్షంగా చెప్పిన వరుణ్.. వితిక‌ తన కంటే ఐదు సంవత్సరాలు చిన్నది అని చెప్పాడు. వితిక‌కు కొన్ని లక్ష్యాలు కలలు ఉన్నాయని… వాటిని సాధించే క్రమంలోనే పిల్లలను ఆలస్యంగా క‌నాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు. ఇక వ‌రుణ్ తాజాగా నటించిన ఇందువదన సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news