Moviesబిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న వైష్ణవ్..కుర్రాడికి స్పీడ్ ఎక్కువే..?

బిగ్గెస్ట్ రిస్క్ చేస్తున్న వైష్ణవ్..కుర్రాడికి స్పీడ్ ఎక్కువే..?

సినీ ఇండస్ట్రీలోకి వారసులు రావడం చాలా కామన్. ఇప్పటికి ఇండస్ట్రీలో సగం మందికి పైగా వాళ్ళే ఉన్నారు. సినీ పరిశ్రమలోకి ఎంతో మంది వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు.. ఇస్తున్నారు. అందులో చాలా తక్కువ మంది మాత్రమే ప్రేక్షకుల నుంచి ఆదరాభిమానాలను అందుకుంటూ సక్సెస్ అవుతున్నారు. దీంతో ఇండస్ట్రీలోని బడా ఫ్యామిలీలతో పాటు మిగిలిన సెలెబ్రిటీల కుటుంబాల నుంచి చాలా మంది హీరోలు పుట్టుకొస్తున్నారు. ఇలా ఈ మధ్య కాలంలో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన హీరోల్లో మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఒకడు. చిన్న వయసులోనే పలు చిత్రాల్లో నటించిన అతడు.. ‘ఉప్పెన’ మూవీతో హీరోగా పరిచయం అవ్వడమే కాకుండా మొదటి సినిమాతోనే తిరుగులేని విజయం అందుకున్నాడు.

 

ఇక రెండో సినిమా గా డైనమిక్ డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్ లో “కొండపోలం” అనే సినిమా లో కనిపించాడు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ అవ్వనప్పటికి టాక్ పరంగా వైషణవ్ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఆయన నుండి వచ్చే మూడో సినిమా ఎలా ఉండబోతుందా అని ఆశగా ఎదురుచూసారు అభిమానులు. ఇక నిన్న ఆయన పుట్టిన రోజున సంధర్భంగా వైష్ణవ్ మూడో చిత్రం పై అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం.

గురువారం వైష్ణవ్ పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మూవీ గురించి అఫిషియల్ గా మేకర్స్ తెలిపారు. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించిన గీరిషయ్య వైష్ణవ్ తేజ్ 3వ చిత్రం రూపొందిస్తున్నాడు. ‘రొమాంటిక్’ బ్యూటి కేతిక శర్మ ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది.

సితార ఎంటర్ టైన్మెంట్స్, ఎస్ విఎస్ సి బ్యానర్ లపై బిఎస్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో వైష్ణవ్ డ్యూయల్ రోల్ చేయబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. చిరంజీవి అందరివాడు ఫార్మెట్ లో తెరకెక్కే ఈ మూవీలో వైష్ణవ్ తండ్రి పాత్రలో కనిపించనున్నారంటూ ఓ వార్త మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మెగా ఫ్యాన్స్ అప్పుడే తండ్రి పాత్రలు చేస్తే నీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది ఆలోచించుకో బ్రదర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news