Moviesఎన్టీఆర్ - బుచ్చిబాబు సినిమా లైన్ ఇదే.. క‌థ‌కు ఆ ఊరితో...

ఎన్టీఆర్ – బుచ్చిబాబు సినిమా లైన్ ఇదే.. క‌థ‌కు ఆ ఊరితో లింక్‌…!

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కెరీర్‌లోనే తిరుగులేని ఫామ్‌లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఏకంగా ఐదు హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి చేసిన భారీ బడ్జెట్ సినిమా త్రిబుల్ ఆర్ కూడా ఇప్ప‌టికే రిలీజ్ కావాల్సి ఉంది. అయితే కోవిడ్‌తో పాటు ఏపీలో టిక్కెట్ల రేట్ల విష‌యంలోనే ఈ సినిమా రిలీజ్‌ను మ‌రోసారి వాయిదా వేశారు.

 

ఈ సినిమా కంప్లీట్ చేసిన తార‌క్ త‌న నెక్ట్స్ ప్రాజెక్టుల విష‌యంలో క్రేజీ లైన‌ప్ ఉండేలా చూసుకుంటున్నాడు. ఇప్పుడు కొర‌టాల శివ సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవ‌ల్లో ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. త‌ర్వాత త్రివిక్ర‌మ్‌, ప్ర‌శాంత్ నీల్ లైన్లో ఉన్నారు. ఇక ఉప్పెన ద‌ర్శ‌కుడు సానా బుచ్చిబాబు కూడా ఎన్టీఆర్ సినిమా కోస‌మే యేడాది నుంచి వెయిటింగ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే.

ఉప్పెన త‌ర్వాత ఎన్ని ఛాన్సులు వ‌చ్చినా కూడా ఎందుకో బుచ్చిబాబు ఎన్టీఆర్ కోస‌మే వెయిట్ చేస్తూ వ‌స్తున్నాడు. ఇప్ప‌టికే ఎన్టీఆర్‌కు క‌థ కూడా చెప్పాడు. ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అదిరిపోయే అప్‌డేట్ ఒక‌టి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల ద్వారా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ సినిమా పూర్తిగా విజ‌య‌న‌గ‌రం ప్రాంతం నేప‌థ్యంలో తెర‌కెక్కుతుంద‌ట‌.

ఈ సినిమా క‌థ‌కు, విజ‌య‌న‌గ‌రంకు లింక్ ఉంటుంద‌ని.. సినిమా క‌థ అంతా అక్క‌డే తిరుగుతుంద‌ని తెలుస్తోంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాపై అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news