Moviesఆ ఒక్క సినిమా తప్పిస్తే..టాలీవుడ్ చరిత్రలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు...

ఆ ఒక్క సినిమా తప్పిస్తే..టాలీవుడ్ చరిత్రలో అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన సినిమాలు ఇవే..!

ఒకప్పుడు తెలుగు సినిమా 50 కోట్ల మార్క్ దాటేందుకే కష్టపడాల్సి వచ్చేది. 50 కోట్లే ఒక రికార్డ్ అన్నట్టుగా ఉండే టాలీవుడ్ ఇండస్ట్రీ 100 కోట్లు కూడా అవలీలగా దాటే రేంజ్ కు వెళ్లింది. బాహుబలి సినిమాతో కలక్షన్స్ లెక్కలన్ని మారిపోయాయి. ఇండస్ట్రీ రికార్డులే కాదు ఇండియన్ సినిమా హిస్టరీలను తిరగరాసింది బాహుబలి. మొదటి పార్ట్ తెలుగు వర్షన్ 183 కోట్లు తీసుకు రాగా.. కన్ క్లూజన్ ఏకంగా 310 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ సినిమా రికార్డులను అందుకోవడం ఇప్పుడప్పుడే సాధ్యం కానట్టే.

రాజమౌళి ‘బాహుబలి’ ని మించి ఏ స్టార్ హీరో సినిమా కూడా అత్యధిక కలెక్షన్ లు రాబట్టలేకపోతుంది అనడంలో సందేహం లేదు. బాహుబలి రేంజ్ బడ్జెట్ పెట్టి తీసినా అది సాధ్యం కావడం లేదు. ఇప్పటికే స్టార్ హీరోలు ఆ దిశగా ప్రయత్నించి చేతులు కాల్చుకున్నారు.బహుబలి సినిమా తరువాతా చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ఏ సినిమా కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ సాధించకపోవడం గమనార్హం. కొన్ని సినిమాలు అయితే బాహుబలి కలెక్షన్స్ దగ్గర వరకు వచ్చి జస్ట్ లో మిస్ అయ్యాయి. బాక్సాఫీస్ వద్ద నాన్ బాహుబలి రికార్డుల లెక్కలు చూస్తే ఎవరు ఊహించని సినిమాలు అత్యధిక ప్రాఫిట్స్ తెచ్చిపెట్టిన జాబితాలలో దర్శనమిస్తున్నాయి. ఇప్పటివరకు బాహుబలిని మినహాయిస్తే ఎక్కువ లాభాలు తెచ్చి పెట్టిన టాప్ 7 సినిమాల ఇవే..!!

1) అల.. వైకుంఠపురములో: అల్లు అర్జున్ , పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా అల.. వైకుంఠపురములో. ఈ సినిమా కొల్లగొట్టిన రికార్డులు ఎన్నో మనకు తెలిసిందే. బన్నీ పర్ ఫామెన్స్..పూజా అందాలు సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేట్రికల్ గా అత్యధిక లాభాలు అందించిన తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

2) గీతగోవిందం: విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న జంటగా నటించిన గీతగోవిందం సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. చిన్న సినిమాల్లో అత్యధిక ప్రాఫిట్స్ అందించిన సినిమాల్లో గీతగోవిందం టాప్ లిస్టులో నిలిచింది. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 55.43కోట్ల వరకు ప్రాఫిట్స్ అందించింది.

3)F2: టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేశ్ ..మెగా హీరో వరుణ్ తేజ్ కలిసి మల్టీ స్టారర్ గా నటించిన చిత్రం F2. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా అత్యధిక ప్రొఫైల్స్ అందించిన సినిమాల్లో మూడవ స్థానంలో నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేసి 50కోట్ల వరకు ప్రాఫిట్స్ అందుకుంది.

4)రంగస్థలం: లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో అందాల తార సమ్మత మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా మొత్తంగా రెండు వందల కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకని రామ్ చరణ్ కెరీర్లోనే ఒక సరికొత్త రికార్డ్ ను క్రియేట్ చేసింది.

5)సరిలేరు నీకెవ్వరు: ఇక మహేష్ బాబు హీరో గా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా అత్యధిక లాభాలను అందించిన సినిమాల లిస్టు లో 5వ స్థానంలో నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించగా.. మొత్తం 99.3 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది.

6)పుష్ప: రీసెంట్ గా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయిన ఈ సినిమాలో బన్నీ పర్ ఫామెన్స్ హైలెట్ గా నిలిచింది. సుకుమార్ టైమింగ్..బన్నీ రైమింగ్..రష్మిక అందాలు ఈ సినిమాకి మరింత ప్లస్ అయ్యాయి. ఇక టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో అత్యధిక లాభాలను అందించిన ఆరో సినిమాగా పుష్ప సినిమా సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

7)సోగ్గాడే చిన్నినాయన: అక్కినేని నాగార్జున కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం సోగ్గాడే చిన్నినాయన. అసలు ఏం అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎవరూ ఊహించని విధంగా భారీ స్థాయిలో లాభాలను కూడా అందించింది. ఇక అత్యధిక లాభాలు తెచ్చి పెట్టిన సినిమాలో సోగ్గాడే చిన్నినాయన ఏడవ స్థానంలో నిలిచింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news