Moviesబాల‌య్య స‌క్సెస్ వెన‌క రెండో కుమార్తె తేజ‌స్విని కూడా...!

బాల‌య్య స‌క్సెస్ వెన‌క రెండో కుమార్తె తేజ‌స్విని కూడా…!

తెలుగులో ఇప్పటి వరకు ఎన్నో టాక్ షో లు వచ్చాయి. వాటిల్లో సూపర్ హిట్ అయిన షోలు ఉన్నాయి. అలాగే చాలా షోలను అసలు జనాలు పట్టించుకోలేదు. గతంలో యాంకర్ ప్రదీప్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా – ఆలీతో సరదాగా – మంచు లక్ష్మి టాక్ షో – రానా చిట్ చాట్ ఇలా చాలా పాపులర్ అయ్యాయి. అయితే ఏ షోకు కూడా బ్లాక్ బస్టర్ టాక్ అయితే రాలేదు. సమంత షో కూడా పెద్దగా క్లిక్ కాలేదు. అయితే సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఆహో ఓటీటీకి చేసిన టాక్ షో మాత్రం దుమ్ముదులిపేసింది. అసలు తెలుగు బుల్లితెర మీద ఏ టాక్ షోకు రాని క్రేజ్ బాలయ్య షోకు వచ్చింది. బాలయ్య షో సూపర్ డూపర్ హిట్ అనిపించుకుంది.

ఈ షో ఇంత హిట్ అవటానికి తెర వెనక టీం పడిన కష్టం అంతా ఒక ఎత్తు అయితే… బాలయ్య కూడా చాలా ఎఫర్ట్ పెట్టి ప‌డ‌న క‌ష్టం కూడా కనిపిస్తోంది. బాలయ్య తన గతానికి భిన్నంగా… ఎవరూ ఊహించని విధంగా ఈ టాక్ షో హోస్ట్ చేస్తున్నారు అనటంలో ఎలాంటి సందేహం లేదు. తనదైన స్టైల్ లో ప్రశ్నలు వేయడంతో పాటు… మధ్య మధ్యలో మాంచి చ‌మ‌క్కులు ఇస్తున్నారు. అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే సూపర్ డూపర్ హిట్ అవడంతో రెండో సీజన్ కూడా తొలి సీజన్ కు మించి ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. తొలి సీజన్లో బాలయ్యకు ఒక్కో ఎపిసోడ్ కు రు. 25 లక్షలు ఇచ్చినట్టు తెలుస్తోంది.

అంటే సీజ‌న్ మొత్తానికి రు. 2.5 కోట్లు ఇచ్చార‌ట‌. అయితే షో హిట్ అవ్వ‌డంతో అల్లు అర‌వింద్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నార‌ని తెలుస్తోంది. మ‌రో విశేషం ఏంటంటే ఈ టాక్‌ను అల్లు అర‌వింద్ ఓటీటీకి చేయ‌డం ఒక ఎత్తు అయితే.. ఈ కార్య‌క్ర‌మానికి బాల‌య్య రెండో కుమార్తె మెతుకుమిల్లి తేజ‌స్విని క్రియేటివ్ క‌న్స‌ల్టెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. స‌హ‌జంగా బాల‌య్య కుమార్తెలు సినిమాల‌కు సంబంధించిన విష‌యాల‌కు దూరంగా ఉంటారు.

ఆ మాట‌కు వ‌స్తే బాల‌య్య విష‌యాల్లో వారి ప్ర‌వేశం ఎప్పుడూ క‌న‌ప‌డ‌దు. అలాంటిది ఇప్పుడు తేజ‌స్విని బాల‌య్య బ్లాక్‌బ‌స్ట‌ర్ టాక్ షోకు క్రియేటివ్ క‌న్స‌ల్టెంట్‌గా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం విశేషంగానే చెప్పుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news