Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో సూప‌ర్ ట్విస్ట్ ఇదే..!

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ షోలో సూప‌ర్ ట్విస్ట్ ఇదే..!

నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ కోసం ఓ టాక్ షో హోస్ట్ చేస్తున్నారని వార్త బయటకు రాగానే పెద్ద సంచలనం అయ్యింది. బాలయ్య వంటి సీనియర్ హీరో ఒక బుల్లితెర షో ను ఎలా ? హ్యాండిల్ చేస్తారు అన్న సందేహాలు చాలా మందిలో కలిగాయి. ఎప్పుడు అయితే ఈ టాక్ షోకు సంబంధించి ట్రైల‌ర్‌ బయటికి వచ్చిందో అప్పటి నుంచే బాలయ్యపై ఉన్న అనుమానాలు అన్నీ పటాపంచలు అయిపోయాయి. ఫ‌స్ట్‌ సీజన్లో ఎంతోమంది సెలబ్రిటీలను బాలయ్య ఇంటర్వ్యూ చేశారు. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబుతో మొదలు పెట్టిన బాలయ్య నేచురల్ స్టార్ నాని – బ్రహ్మానందం – అనిల్ రావిపూడి – లైగర్ సినిమా టీం – మాస్ మహారాజ్ రవితేజ – దర్శకుడు మలినేని గోపిచంద్ – పుష్ప టీమ్‌ను వరుసపెట్టి ఇంటర్వ్యూలు చేశారు. వాస్తవంగా చెప్పాలంటే ఈ షో అంచనాలకు మించి సూపర్ డూపర్ హిట్ అయిందని చెప్పాలి.

మ‌హేష్ ఎపిసోడ్‌తో ఈ ఓటీటీ టాక్ షో ఫస్ట్ సీజన్ ముగిస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఈ షోకు సంబంధించి చివరి ఎపిసోడ్ ను త్వరలోనే స్ట్రీమింగ్ చేయబోతున్నారు. కాస్త‌ గ్యాప్ ఇచ్చి త్వరలోనే సీజన్ 2 స్టార్ట్ చేస్తారని ఆహా కాంపౌండ్ నుంచి సమాచారం బయటకు వచ్చింది. ఈ ఏడాది వేసవిలో సీజ‌న్ 2 ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం అందుతోంది. ఈ ఫ‌స్ట్ సీజ‌న్ ముగించడానికి ఇప్పటికే ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు. ఈ సీజన్లో వచ్చిన అన్ని ఎపిసోడ్లు కు సంబంధించిన బెస్ట్ సీన్లు ఎడిట్ చేసి… దీనిని చివరి వారంలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే మహేష్ బాబుతో షూట్ చేసిన బాలయ్య ఎపిసోడ్ ను ఎప్పుడు ? చేస్తారు అది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. సంక్రాంతి కానుకగా మహేష్ బాబు – బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్‌ అవుతుందని అభిమానులు ఆశించారు. అయితే సంక్రాంతికి లైగ‌ర్‌ సినిమా టీంతో బాలయ్య చేసిన ఇంటర్వ్యూ స్ట్రీమింగ్‌ చేశారు. అయితే మహేష్ బాబు ఎపిసోడ్‌ను మాత్రం స్ట్రీమింగ్ చేయకుండా ఆపేశారు. తొలి సీజన్లో చివరి ఎపిసోడ్ గా దీనిని స్ట్రీమింగ్ చేస్తారా ? లేదా కొద్ది రోజుల సమయం తీసుకుని మహేష్ బాబు – బాలయ్య ఎపిసోడ్ స్ట్రీమింగ్ చేస్తారా అన్నది క్లారిటీ లేదు.

ఏదేమైనా తొలి సీజన్‌ను మాత్రం బాలయ్య అదరగొట్టేసారు అని చెప్పాలి. ఇక బాలయ్య తన నెక్స్ట్ సినిమా మలినేని గోపీచంద్ దర్శకత్వంలో నటిస్తున్నారు. మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కోలీవుడ్‌ హీరోయిన్ వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news