Moviesఆ పూలు కనిపిస్తే..బెడ్ రూంకే.. స్టార్ డాటర్ స్పీడ్ తట్టుకోవడం కష్టమే..?

ఆ పూలు కనిపిస్తే..బెడ్ రూంకే.. స్టార్ డాటర్ స్పీడ్ తట్టుకోవడం కష్టమే..?

లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ఈ అందాల తార శృతి హాసన్. ఇంటస్ట్రీలోకి వచ్చిన కొత్తల్లో ఒక్క హిట్ సినిమా కోసం చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన ఈ భామా..ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో మొదటి సారి హిట్ అంటే ఎలా ఉంటుందో రుచి చూసింది. అంతే ఇక ఆ తరువాత అమ్మడుకి స్టార్ డైరెక్టర్స్ వరుస అవకాశాలు ఇచ్చారు.

దీంతో ఈ అమ్మడు కెరీర్ జెట్ స్పీడ్ లో దూసుకుపోయింది. అసలు క్షణం కూడా తీరిక లేకుండా వరుస సినిమాలకు కమిట్ అయ్యి స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలు అందుకుంది అంటే అప్పట్లో అమ్మడు రేంజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతేకాదు శృతి కి మ్యూజిక్ అంటే ప్రాణం ..ఈమె సినిమాల్లో నటించడమే కొన్ని మూవీస్ లో పాటలు కూడా పాడి..తనలోని టాలెంట్ ను అందరికి చూయిం చింది. స్టార్‌ డాటర్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా కానీ తనకంటూ సొంత టాలెంట్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నటిగా తనేంటో నిరూపించుకుని తండ్రికి తగ్గ కూతురిగా ఓ గుర్తింపు సంపాదించుకుంది.

ఇక అమ్మడు రీసెంట్ గానె 36 వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. ఇక ఈ క్రమంలో శృతి హాసన్ తనకు ఇష్టమైన పూలు, ఫుడ్ గురించి అభిమానులతో పంచుకుంది. లోకనాయకుడు కూతురికి రోజా పూలు,లిల్లీ పూలు అంటే చాలా ఇష్టమట. అవి ఎక్కడ కనపడిన ఖచ్చితంగా కొనుకుని తన రూం లో పెట్టుకుంటుందట. అలాగే ఫుడ్ విషయంలో వడ , దోశ కాంబినేషన్ అంటే పిచ్చ ఇష్టమట. రైస్ లోకి అయితే సాంబర్, రసం ఖచ్చితంగా ఉండాసిందేనట. ఫూట్స్ విషయానికి వస్తే సీతాఫలాలు, చెర్రీలు చాలా ఇష్టమట. ఇక ఈ స్టార్ డాటర్ టేస్ట్ తెలుసుకున్న నెటిజన్స్..శృతి అభిరుచులు చాలా బాగున్నాయి అంటూ కామెంట్స్ చేస్తూ..పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రజెంట్ బడా బడా సినిమాలు చేతులు పట్టుకుని ఫుల్ స్పీడ్ మీద ఉంది శృతి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news