Moviesసిరి - శ్రీహాన్ కూడా బ్రేక‌ప్‌.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ ఏం కావాలి..?

సిరి – శ్రీహాన్ కూడా బ్రేక‌ప్‌.. ఇంత‌క‌న్నా ఫ్రూప్స్ ఏం కావాలి..?

టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ సమంత – అక్కినేని నాగచైతన్య విడాకులు ముందు ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. ఎన్నో పుకార్లు వచ్చాయి. సోషల్ మీడియాలో వారిద్దరి విడిపోతున్నానంటూ పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అవన్నీ అబద్ధాలే అయి ఉంటాయని చాలా మంది అనుకున్నా… చివరకు ముందుగా వచ్చిన పుకార్లు నిజమయ్యాయి. చైతు – సమంత విడిపోతున్నట్లు ప్రకటించారు. వాళ్ళిద్దరు విడిపోయిన రెండు నెలల వరకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆ విడాకులు గురించే చర్చ నడిచింది. ఆ తర్వాత సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉన్న యూట్యూబ‌ర్లు దీప్తి సునైనా – షణ్ముఖ్ జస్వంత్ రిలేషన్ కూడా బ్రేకప్ అయ్యింది.

ఐదేళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ష‌న్నూ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లేంత‌ వరకు కూడా వీరి బంధం ఎంతో బలంగా ఉంది. హౌస్‌లో జరిగిన పరిణామాలతో హర్ట్ అయిన దీప్తి – షణ్ముక్ నుంచి విడిపోవాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే దీప్తి ముందుగా తమ రిలేషన్ బ్రేకప్ అయినట్టు అధికారిక ప్రకటన చేసింది. తీవ్ర భావోద్వేగంతో సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ కూడా పెట్టింది.

దీనిపై స్పందించిన కూడా ష‌న్నూ కూడా దీప్తికి మంచి జరగాలని తాను కోరుకుంటున్నానని.. తాము స్నేహితులుగా ఉంటామని ప్రకటించాడు. ఈ వివాదానికి కారణం అయిన సిరిని నెటిజన్లు బాగా ట్రోల్‌ చేస్తున్నారు. నీ వల్ల ఒక జంట విడిపోయారని సిరిని ఒక ఆట ఆడుకుంటున్నారు. అయితే సిరి మాత్రం షణ్ముఖ్ – దీప్తి విడిపోవడానికి తాను కారణం కాదని ఎంత మొత్తుకుంటున్నా.. ఆమెపై ట్రోలింగ్ కు మాత్రం ఆగ‌డం లేదు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌రో బాంబ్ లాంటి న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. సిరి – శ్రీహాన్ కూడా విడిపోతున్న‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. వీరిద్ద‌రికి ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింది. అయితే బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న‌ప్పుడు ఓసారి శ్రీహాన్ కూడా వ‌చ్చాడు. అప్పుడే సిరితో శ్రీహాన్ సిరి న‌న్ను వ‌దిలేస్తున్నావా ? అని అడ‌గ‌డం.. దానికి సిరి సారీ చెప్పి శ్రీహాన్‌ను కూల్ చేయ‌డం జ‌రిగాయి.

చివ‌ర‌కు సిరి వ‌ల్లే ష‌ణ్నూ – దీప్తి విడిపోయార‌న్న ప్ర‌చారం బ‌లంగా అంద‌రిలోనూ నాటుకుపోవ‌డంతో శ్రీహాన్ కూడా హ‌ర్ట్ అయిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక హౌస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక సిరిని క‌లిసేందుకు శ్రీహాన్ కూడా ప్ర‌య‌త్నించ‌డ లేద‌ట‌. అటు సిరి కూడా శ్రీహాన్‌ను క‌లిసేందుకు ఆస‌క్తి చూప‌లేదు. ఈ ప‌రిణామాలే వీరిద్ద‌రు విడిపోయేందుకు కార‌ణ‌మ‌వుతున్నాయ‌ని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news