Moviesభ‌ర్త‌కు 8 నెల‌ల‌కే విడాకులు ఇచ్చిన శ్వేత‌బాసు... అంత టార్చ‌ర్ పెట్టాడా..?

భ‌ర్త‌కు 8 నెల‌ల‌కే విడాకులు ఇచ్చిన శ్వేత‌బాసు… అంత టార్చ‌ర్ పెట్టాడా..?

సినిమా రంగం అనేది పూర్తిగా గ్లామర్ ఫీల్డ్. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ? ఎవ్వరూ ఊహించలేరు. ఇక్కడ అవకాశాల కోసం ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే వారు వేసే రాంగ్ స్టెప్పులు వారి జీవితాలను తలకిందులు చేసేస్తాయి. ఒకటి రెండు సినిమాలు సూపర్ హిట్ అవడంతో వచ్చిన క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ అడ్డదారులు తొక్కుతూ ఉంటారు. ఇవే వారి కొంప కొల్లేరు చేసేస్తాయి. శ్వేతా బసు ప్రసాద్… వరుణ్ సందేశ్ హీరోగా వచ్చిన కొత్త బంగారులోకం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది.

ఎకాడ అంటూ అప్పట్లో ఆమె చెప్పిన డైలాగ్ కుర్రకారుకు మాంచి కిక్ ఇచ్చేసింది. కొత్త బంగారులోకం సినిమా హిట్ అయ్యాక శ్వేతాబసుకు కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలు హిట్ కాకపోవడంతో ఆమె అడ్డదారులు తొక్కింది. ఈ క్రమంలోనే వ్యభిచారం చేస్తుండగా పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా దొరికి కొన్ని రోజులు జైలులో కూడా ఉండాల్సి వచ్చింది. ఆ తర్వాత బాలీవుడ్ దర్శ‌కుడు రోహిత్ మిట్ట‌ల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లి ఎంతో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

అయితే ఎనిమిది నెలలకే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది. పెళ్లికి ముందే శ్వేతాబసుప్రసాద్ అనేక వివాదాల్లో కూరుకుపోయింది. శ్వేత గురించి పూర్తిగా తెలిసిన తర్వాతే రోహిత్ మిట్ట‌ల్ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తర్వాత రోహిత్ మిట్టల్ శ్వేతాబసు గతం గురించి ఆమెను ప‌దే ప‌దే టార్చర్ పెట్టడంతో విసిగిపోయిన ఆమె చివరకు భర్తకు విడాకులు ఇచ్చేసింది. భర్త నుంచి దూరం అయ్యాక తాను తన జీవితాన్ని చాలా స్వేచ్ఛగా అనుభవిస్తున్నా అని తెలిపింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news