Moviesవారిద్ద‌రి ప్రేమ‌కు విల‌న్‌గా స‌మంత‌.. అదిరిపోయే ట్విస్టులు...!

వారిద్ద‌రి ప్రేమ‌కు విల‌న్‌గా స‌మంత‌.. అదిరిపోయే ట్విస్టులు…!

స‌మంత విడాకుల త‌ర్వాత త‌న లైఫ్‌ను త‌న‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్టుగా ఎంజాయ్ చేస్తోంది. ఆమె వ‌రుస పెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. అస‌లు ఆమె గ్లామ‌ర్ షోకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మావా ఐటెం సాంగ్ చూస్తేనే స‌మంత గ్లామ‌ర్ డోస్‌కు హ‌ద్దులు లేవ‌ని అర్థ‌మ‌వుతోంది. ఆ త‌ర్వాత బాలీవుడ్‌లో రెండు సినిమాల‌తో పాటు ఓ బోల్డ్ వెబ్ సీరిస్‌లో చేసేందుకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చింది.

ఇక గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లంతో పాటు య‌శోద సినిమా చేస్తోంది. అటు కోలీవుడ్‌లోనూ కీల‌క ప్రాజెక్టుల‌కు గ్రీన్‌సిగ్న‌ల్ ఇస్తోంది. విడాకుల త‌ర్వాత మాత్ర‌మే కాదు.. విడాకుల‌కు ముందు కూడా ఆమె ఫ్యామిలీమ్యాన్ వెబ్‌సీరిస్‌లో ఎంత బోల్డ్‌గా చేసిందో చూశాం. అయితే ఇప్పుడు ఆమె ఓ సినిమాలో ప‌వ‌ర్ ఫుల్ లేడీ విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది. ఇది స‌మంత కెరీర్‌లో మ‌రో ట‌ర్నింగ్ పాయింట్‌గా నిల‌వ‌నుంది.

కోలీవుడ్‌లో కాత్తువాక్కుల రెండు కాదల్ సినిమాలో ఆమె న‌టిస్తోంది. ఈ సినిమా విజయ్ సేతుపతి, నయనతార జోడీగా విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో వ‌స్తోంది. ఇది టిపిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రానుంది. ఈ సినిమాలో న‌య‌న‌తార‌తో పాటు ఆమెతో స‌మాన‌మైన పాత్ర‌లో స‌మంత న‌టిస్తోంది. ఈ సినిమాలో ఆమెది ప‌వ‌ర్ ఫుల్ నెగిటివ్ రోల్ అని టాక్ ?

 

స‌మంత పాత్ర క‌థ‌ను కీల‌క మ‌లుపు తిప్పుతుంద‌ని తెలుస్తోంది. విజ‌య్‌సేతుప‌తి – న‌య‌న‌తార ప్రేమాయ‌ణంలో స‌మంత విల‌న్‌గా క‌నిపించ‌బోతోందట‌. ఏదేమైనా ఈ త‌ర‌హా రోల్స్ గ‌తంలో చాలా మంది హీరోయిన్లు పోషించారు. అయితే ఇప్పుడు స‌మంత ఈ పాత్ర‌లో క‌నిపిస్తే నిజంగా ఆ సినిమా రేంజ్ వేరుగా ఉంటుంది అన‌డంలో డౌట్ లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news