Moviesట్రెండింగ్‌లో పూజా హెగ్డే... కార‌ణం ఆ హీరోయే...!

ట్రెండింగ్‌లో పూజా హెగ్డే… కార‌ణం ఆ హీరోయే…!

పూజా హెగ్డే కెరీర్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉంది. వ‌రుస హిట్ల‌తో ఆమె దూసుకుపోతోంది. అస‌లు ఇప్పుడు తెలుగుతో పాటు త‌మిళ్‌లో ఒక్క పెద్ద సినిమా సెట్ అయితే చాలు అందులో హీరోయిన్‌గా పూజా హెగ్డేనే సెట్ అయిపోతోంది. అటు స్టార్ హీరోల నుంచి మీడియం రేంజ్ హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు అంద‌రూ కూడా ఇప్పుడు పూజానే త‌మ సినిమాలో హీరోయిన్‌గా ఉండాల‌ని ప‌ట్టుబ‌డుతున్నారు. పైగా పూజా హెగ్డే ఉంటే సినిమాకు మార్కెట్ పెర‌గ‌డంతో పాటు ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఎక్కువుగా జ‌రుగుతోంది.

అందుకే పూజా హెగ్డే రు. 3 నుంచి 4 కోట్లు డిమాండ్ చేస్తున్నా ఆమెనే ప‌ట్టుబ‌ట్టి హీరోయిన్‌గా పెట్టుకుంటున్నారు. మ‌రోవైపు బాలీవుడ్ సినిమాల‌తో పాటు ఇటు త‌మిళంలోనూ ఆమె సినిమాలు చేస్తోంది. దీంతో పూజా హెగ్డే డిమాండ్ మామూలుగా లేదు. ప్ర‌స్తుతం తిరుగులేని స్టార్ హీరోయిన్ స్టేట‌స్ ఎంజాయ్ చేస్తోన్న ఆమె కెరీర్‌ను ఒక్క‌సారిగా ట‌ర్న్ చేసింది అల వైకుంఠ‌పుర‌ములో సినిమాయే అని చెప్పాలి.

ఈ సినిమాకు ముందు ఆమె మహర్షి, అరవింద సమేత లాంటి హిట్లు కొట్టినా అల వైకుంఠ‌పుర‌ములో త‌ర్వాత ఆమెకు బుట్ట‌బొమ్మ అన్న ఇమేజ్ వ‌చ్చేసింది .అస‌లు పూజా పేరు మారిపోయి ఆమె బుట్ట‌బొమ్మ‌గా పాపుల‌ర్ అయ్యింది. బ‌న్నీ – త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన అల వైకుంఠ‌పుర‌ములో సినిమా వ‌చ్చి రెండేళ్లు అయిన సంద‌ర్భంగా ఇప్పుడు పూజా మ‌రోసారి సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

ఆమె అభిమానుల‌తో పాటు బ‌న్నీ అభిమానులు ఈ సినిమా పిక్‌ల‌తో పాటు బుట్ట‌బొమ్మ హాట్ ఫొటోలు సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. దీంతో ఆమె ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. ఇక పూజా కూడా ఈ సినిమా రిలీజ్ అయిన‌ప్పుడు బ‌న్నీ ఫ్యాన్స్ చేసిన హంగామా వీడియోల‌ను ఇప్పుడు త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో పాటు అంద‌రికి మ‌రోసారి థ్యాంక్స్ చెప్పింది. బ‌న్నీ పుణ్య‌మా అని ఆమె ఇప్పుడు మళ్లీ వార్త‌ల్లోకి ఎక్కేసింది. ఇక ప్ర‌స్తుతం ఆమె రాధేశ్యామ్‌, ఆచార్య‌, బీస్ట్ లాంటి పెద్ద సినిమాలు చేస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news