Moviesఆంటీతో ఎఫైర్ అంటూ ట్రోల్‌.. అర్జున్ క‌పూర్‌కు చిర్రెత్తు కొచ్చి ఏం...

ఆంటీతో ఎఫైర్ అంటూ ట్రోల్‌.. అర్జున్ క‌పూర్‌కు చిర్రెత్తు కొచ్చి ఏం చేశాడంటే..!

బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ – హాట్ బ్యూటీ మ‌లైకా అరోరా గత నాలుగు సంవత్సరాలుగా రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వయసులో 12 ఏళ్లకు పైగా గ్యాప్‌ ఉంది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయిన మ‌లైకా ఆంటీ వ‌య‌స్సు దాటేసి… ఇప్పుడు అమ్మమ్మ వయసులో ఉంది. కానీ మ‌లైకా ఫిజిక్ చూస్తుంటే ఆమె ఇంకా కుర్ర హీరోలకు పోటీ ఇచ్చేలా ఉన్నట్లుగా కనిపిస్తుంది.

ఆర్పాజ్‌ఖాన్‌ కి విడాకులు ఇచ్చిన మ‌లైకా ఇప్పుడు పూర్తిగా అర్జున్ క‌పూర్ దగ్గరే ఉంటుంది. వీరిద్దరూ కలిసి ప్రపంచవ్యాప్తంగా ప్రేమ పక్షుల విహరిస్తూ వస్తున్నారు. వీరిద్దరి ఎఫైర్‌ ఇప్పుడు ఎంత బహిర్గతం అయినా కూడా… పెళ్లిపై మాత్రం ఎవరికి వారు మాట దాటేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది వీరిద్దరూ కచ్చితంగా పెళ్లి చేసుకుంటారు అన్న ప్రచారం కూడా నడుస్తోంది. అసలు వీరిద్దరి ఎఫైర్ బోనీ కపూర్ కు ఎంతమాత్రం ఇష్టం లేదు.

మ‌లైకాను వదిలి పెట్టాల‌ని అర్జున్ కపూర్ పై ఎన్నిసార్లు సీరియస్ అయినా అర్జున్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా మ‌లైకాతో చెట్టాపట్టాలు వేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు. మ‌లైకా ఈ వయసులో కూడా బికినీ వేసుకుని హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులు ఇస్తూ సోషల్ మీడియాను వేడెక్కిస్తోంది. ప్రస్తుతం అర్జున్ కపూర్ వయస్సు 36 సంవత్సరాలు కాగా.. మ‌లైకా వ‌య‌స్సు 48.

వీరిద్దరి మధ్య ప్రేమ ఏంట్రా బాబు.. అస‌లు ఆంటీతో కుర్రోడు ప్రేమ ఏంట‌న్న ట్రోలింగ్‌లు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో అర్జున్ క‌పూర్ ఈ విషయంపై స్పందిస్తూ తమపై విమర్శలు చేసే వారికి ఘాటైన ఆన్సర్ ఇచ్చాడు. అస‌లు ట్రోలింగ్‌లోనే 90 శాతం ఫేక్ ఉంటుంద‌ని.. త‌న‌ను ట్రోల్ చేసేవారు.. త‌న‌తో సెల్ఫీలు దిగేందుకు వ‌స్తార‌ని.. సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్‌ల‌కు తాను స్పందించాల్సిన ప‌నిలేద‌ని చెప్పాడు.

త‌న ప‌ర్స‌న‌ల్ లైఫ్ డిసైడ్ చేసుకునే హ‌క్కు త‌న‌కు ఉంద‌ని.. వ‌య‌స్సు చూసి రిలేష‌న్ షిప్ స్టార్ట్ చేయ‌డం పిచ్చి చ‌ర్య అని మండిప‌డ్డాడు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news