Moviesచిరంజీవి సినిమాతోనే నా కెరీర్ నాశనమైంది..సీనియర్ హీరోయిన్ సెన్షేషనల్ కామెంట్స్

చిరంజీవి సినిమాతోనే నా కెరీర్ నాశనమైంది..సీనియర్ హీరోయిన్ సెన్షేషనల్ కామెంట్స్

సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్స్ వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రం అలా గుర్తుండిపోతారు. తమ నటనతో అందంతో కొందరు మాత్రమే అభిమానుల మనసుల్లో ఓ స్పెషల్మ్ స్దానాని అందుకోగలరు అలాంటి వారిలో ఈ హీరోయిన్ “మోహిని” కూడా ఒకరు. బహుశా ఈ పేరు చెప్పగానే..చాలా మంది గుర్తు పట్టక పోవచ్చు. ఎవరబ్బా ఈ హీరోయిన్.. అని చాలా మంది అనుకుంటుంటారు కూడా.. అదే మన నటసింహం నందమూరి బాలకృష్ణ క్లాసిక్ మూవీ ‘ఆదిత్య 369′ హీరోయిన్‌ అని చెప్పితే టక్కున గుర్తుపట్టేస్తారు. యస్..’ఆదిత్య 369’ మూవీలో బాలయ పక్కన హీరోయిన్‌ గా చేసిందే.. ఆమె పేరే మోహిని.

‘ఆదిత్య 369’ సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాలో హీరోయిన్ మోహినికి కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇక ఈమె హిట్లర్ మూవీ లో చిరంజీవికి చెల్లెలిగా కూడా నటించారు . ఒక్క తెలుగు భాష లోనే కాకుండా మలయాళం తమిళ సినిమాలలో కూడా నటించిన ఇమె..దాదాపు 100పైగా సినిమాల్లో నటించి మెప్పించారు.

అంతేకాకుండా ఈమె కొన్ని కోట్ల మంది హిందువులకు గురువు అయిన రమణ మహర్షికి వరుసకు మనవరాలు అవుతుంది. అయితే తన సినీ కెరీర్ గురించిన ముచ్చట్లను చెబుతూ తాజాగా ఓ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు మోహిని. ఇక ఆ ఇంటర్వ్యుల్లో ఆమె తన విషయాలను ఓపెన్ గా చెప్పేసింది. తన జీవితంలో మలుపులెన్నో ఉన్నాయని చెప్పిన ఈ ముద్దుగుమ్మ..తన లైఫ్ ఇలా అయిపోవడానికి పరోక్ష కారణం చిరంజీవి అంటూ షాక్ ఇచ్చింది.

తన అందంతో నటనతొ మిగతా బాషల్లో మెప్పించగల్గిన ఈమె తెలుగు అభిమానులను ఆకట్టుకున్న హీరోయిన్ గా మాత్రం అవకాశాలు తెచ్చుకోలేకపోయింది. దీనికి కారణం చిరంజీవి సినిమా నే అంతూ బిగ్ బాంబ్ పేల్చింది. చిరంజీవి హిట్లర్ సినిమాలో ఆయనకు చెల్లెలుగా నటించిన ఈమె ఆ తరువాత హీరోయిన్ గా అవకాశాలు రాలేదట.

ఎందుకా అని డైరెక్టర్స్ ని అడిగితే..ఇప్పటికే చెల్లిగా నటించావు..మళ్ళీ హీరోయిన్ అంటే ప్రేక్షకులు చూడరని సందేహాలు వ్యక్తం చేశారట. అందుకే చిరంజీవికి చెల్లిగా నటించడం నేను చేసిన పొరపాటని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం మోహిని చిరంజీవి విషయంలో చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news