Moviesవాడు ఓ తిక్కలోడు..ఆ డైరెక్టర్ పై జగపతి బాబు ఊహించని కామెంట్స్..!!

వాడు ఓ తిక్కలోడు..ఆ డైరెక్టర్ పై జగపతి బాబు ఊహించని కామెంట్స్..!!

జగపతి బాబు..నటనకు మరో మారు పేరు ఈయన అని చెప్పినా తప్పు లేదు. ఏ పాత్రలోనైన లీనమైపోయి నటించడం ఈయన స్పెషాలిటీ. ఒక్కప్పుడు టాలీవుడ్ ఫ్యామిలీ హీరోగా అందరి మనసులను గెలుచుకున్న ఈ హీరో..ఇప్పుడు విలన్ గాను అందరిని ఆకట్టుకుంటున్నారు. హీరోగా అమ్మాయి మనసులను కొల్లగొట్టిన ఈయన విలన్ గా భాయపెట్టడంలోను మంచి మార్కులు వేయించుకున్నారు. క‌థానాయ‌కుడిగా ఎంత గుర్తింపు పొందారో ప్ర‌తినాయ‌కుడిగా అంత‌కంటే ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్నారు జ‌గ‌ప‌తి బాబు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.


ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో యాంగ్ రొమాంటిక్ హీరో జగపతి బాబు.. ఆయన నటన సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను బాగా ఆకట్టుకుంటుంది. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో దక్షిణాది భాషల్లో దూసుకెళ్తున్న నటుడు జగపతి బాబు. అప్పట్లో ఫ్యామిలీ హీరో అనే క్రేజ్ ను సొంతం చేసుకున్న జగపతి బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. ఆతర్వాత కొన్ని కారణాల చేత ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఈసారి మాత్రం విలన్ గా పవర్ ఫుల్ కం బ్యాక్ పర్ ఫామెన్స్ ఇస్తూ అదరగొట్టేస్తున్నారు.

జగపతి బాబు తన సినీ కెరీర్ లో ఎంతో మంది డైరెక్టర్స్ తో వర్క్ చేసారు. చాలా మంచి మంచి బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. ఇక రీసెంట్ ఇంటర్వ్యుల్లో ఆయన మాట్లాడుతూ..డైరెక్టర్ రాం గోఫాల్ వర్మ గురించి షాకింగ్ కామెంట్స్ చేసారు. జగపతి బాబు మాట్లాడుతూ.. ” రామ్ గోపాల్ వర్మ ఒక తిక్కలోడు. నేను అలాంటి వాడినే. లేకపోతే గాయం సినిమా షూటింగ్ టైంలో వర్మ దగ్గారకు వెళ్లి నాకు ఊర్మిళకు మధ్య కెమిస్ట్రీ సరిగ్గా రావడం లేదండి అని చెప్పాడంతో ఆయన డైరెక్ట్ గా ఊర్మిళ దగ్గరకు వెళ్లి జగపతి బాబుకు నువ్వంటే ఇష్టం లేదట అని చెప్పేశాడు.

ఇక ఆమె వచ్చి నన్ను మొహానే అడిగేసింది ఎందుకు నేను మీకు నచ్చలేదు అని. ఇక చాలా సేపు డిస్కషన్స్ తరువాత ఊర్మిళ అంటే ఇష్టం అని చెబితేనే సినిమా పూర్తి చేస్తా అని వర్మ అని చెప్పాడు నేను షాక్ అయ్యాను. నేను వర్మ లాగా తిక్కలోడినే అప్పుడు నేను.. నువ్వంటే నాకు ఇష్టం లేదు.. ఊర్మిళ అంటే కూడా నాకు ఇష్టం లేదు అని చెప్పేశాను. మళ్ళీ వెళ్లి నీకు శ్రీదేవి ఇష్టం కాబాట్టి నాకు శ్రీదేవి అన్న ఇష్టం లేదు అని చెప్పేశా.. దీంతో వర్మ గుడ్ అందుకే నువ్వంటే నాకు ఇష్టం అన్నారు. వర్మ కి ఉన్నదున్నట్టుగా చెప్పేవాళ్ళే నచ్చ్తారుఅని జగపతి బాబు తెలిపారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news