Moviesక‌ళ్యాణ్‌దేవ్ హీరో అవ్వ‌డం వెన‌క ఇంత జ‌రిగిందా...!

క‌ళ్యాణ్‌దేవ్ హీరో అవ్వ‌డం వెన‌క ఇంత జ‌రిగిందా…!

వారం రోజుల క్రితం కోలీవుడ్ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ కుమార్తె ఐశ్వ‌ర్య‌, హీరో ధ‌నుష్ జంట విడాకులు తీసుకున్న‌ప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ‌, అల్లుడు క‌ళ్యాణ్‌దేవ్ కూడా విడిపోతున్నారంటూ ఒక్క‌టే ప్ర‌చారం జ‌రిగింది. అస‌లు ఈ వార్త‌లు మూడు , నాలుగు రోజులు సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేశాయి. ఈ వార్త‌ల‌పై ఎవ్వ‌రూ స్పందించ‌లేదు. మ‌ళ్లీ సోష‌ల్ మీడియా వాళ్లే ఈ జంట విడిపోవ‌డం లేద‌ని రాసుకున్నారు. అంతే త‌ప్పా ఇంత పెద్ద ప్ర‌చారం జ‌రిగినా అటు శ్రీజ కాని.. ఇటు క‌ళ్యాణ్‌ వైపు నుంచి కానీ రిప్లేలు లేవు.

ఇక క‌ళ్యాణ్ దేవ్ గురించి ఆస‌క్తిక‌ర విష‌యాలు తెలుసుకుందాం. క‌ళ్యాణ్‌దేవ్ పూర్తి పేరు క‌ళ్యాణ్‌దేవ్ కానుగంటి. మ‌నోడు 1990 ఫిబ్ర‌వ‌రి, 11న కిష‌న్ కానుగంటి, జ్యోతి దంప‌తుల‌కు జ‌న్మించాడు. హైద‌రాబాద్‌లో నివాసం ఉంటే క‌ళ్యాణ్ మెగాస్టార్ చిన్న‌కుమార్తె శ్రీజ‌ను పెళ్లి చేసుకున్నాడు. అప్ప‌టికే శ్రీజ‌కు త‌న క్లాస్‌మెట్ శిరీష్ భ‌ర‌ద్వాజ్‌తో పెళ్లి అయ్యి ఓ పాప పుట్టాక విడాకులు తీసుకుంది. ఇక శ్రీజ – క‌ళ్యాణ్ దంప‌తుల‌కు న‌విక్ష అనే పాప పుట్టింది.

క‌ళ్యాణ్ కుటుంబానికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వీళ్లు జూబ్లిహిల్స్ రోడ్ నెంబ‌ర్ 30లో త‌మ సొంత ఇంట్లో ఉంటున్నారు. మెగా కుటుంబంలో అంద‌రూ సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి హీరోలుగా కొన‌సాగుతుండ‌డంతో క‌ళ్యాణ్‌దేవ్ కూడా మెగాస్టార్‌కు అల్లుడు అయ్యాక హీరో కావాల‌ని అనుకున్నాడు. స్నేహితులు ఎంక‌రేజ్‌మెంట్‌తో శ్రీజ ద్వారా త‌న మ‌న‌సులో మాట‌ను చిరంజీవి ముందు ఉంచాడు.

అయితే చిరుకు ముందు క‌ళ్యాణ్ హీరో అవ్వ‌డం ఇష్టంలేక‌పోయినా.. చివర‌కు క‌ళ్యాణ్ ఆస‌క్తి, శ్రీజ బ‌ల‌వంతంతో ఒప్పుకోక త‌ప్ప‌లేదు. ఈ క్ర‌మంలోనే క‌ళ్యాణ్ మొద‌టి సినిమా కూడా చిరు గ‌తంలో చేసిన హిట్ సినిమా టైటిల్ విజేత‌తో వ‌చ్చింది. ఆ సినిమా పెద్ద‌గా ఆడ‌లేదు. త‌ర్వాత సూప‌ర్‌మ‌చ్చి కూడా ప్లాప్ అయ్యింది. క‌ళ్యాణ్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క హిట్ కూడా లేక‌పోయినా మ‌నోడి లైన‌ఫ్‌లో మాత్రం మంచి ప్రాజెక్టులే ఉన్నాయి. క‌ళ్యాణ్ ప్ర‌స్తుతం ఒక్కో సినిమాకు రు. కోటి నుంచి కోటిన్న‌ర మ‌ధ్య‌లో రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news