Moviesర‌జ‌నీకాంత్ - ధ‌నుష్ ఫ్యామిలీలో వ‌రుస విడాకులు... ఎంత‌మంది అంటే...!

ర‌జ‌నీకాంత్ – ధ‌నుష్ ఫ్యామిలీలో వ‌రుస విడాకులు… ఎంత‌మంది అంటే…!

ఇటీవ‌ల కాలంలో సినిమా వాళ్ల‌కు విడాకులు మామూలు అయిపోయాయి. చివ‌ర‌కు స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లు కూడా చాలా సింపుల్‌గా ప్రేమించుకుని.. పెళ్లి చేసుకుని.. అంతే సింపుల్‌గా విడిపోతున్నారు. కొద్ది నెల‌ల క్రితం టాలీవుడ్ స్టార్ క‌ఫుల్ అక్కినేని నాగ‌చైత‌న్య – స‌మంత విడిపోవ‌డం పెద్ద సంచ‌ల‌నం అయ్యింది. ఈ సంఘ‌ట‌న ఇంకా మ‌దిలో ఉండ‌గానే.. ఇప్పుడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య , హీరో ధ‌నుష్ విడాకులు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చారు.

గ‌త రాత్రి ధ‌నుష్ – ఐశ్వ‌ర్య విడాకుల‌పై ప్ర‌క‌ట‌న చేశారు. అస‌లు వీరిద్ద‌రు ఎందుకు విడిపోవాల్సి వ‌చ్చింది ? అన్న‌దానిపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇటు ర‌జ‌నీకాంత్ ఫ్యామిలీతో పాటు అటు ధ‌నుష్ ఫ్యామిలీలో ఇప్ప‌టికే చాలా విడాకులు అయిపోయాయి. ర‌జ‌నీకాంత్ రెండో కుమార్తె సౌంద‌ర్య ముందుగా అశ్వినీ రామ్‌కుమార్‌ను 2010లో పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు పుట్టాక మ‌న‌స్ప‌ర్థ‌లు రావ‌డంతో 2017లో విడిపోయారు. అనంత‌రం సౌంద‌ర్య ఓ బిజినెస్‌మేన్‌తో ప్రేమ‌లో ప‌డి 2019లో అత‌డిని పెళ్లి చేసుకుంది.

ఇక ఇప్పుడు ర‌జ‌నీ పెద్ద కుమార్తె ఐశ్వ‌ర్య సైతం ధ‌నుష్‌తో ప్రేమ‌లో ప‌డి పెళ్లి చేసుకుంది. వీరికి 15 , 11 ఏళ్ల వ‌య‌స్సు ఉన్న ఇద్ద‌రు కుమారులు ఉన్నారు. ఇక వీరికి పెళ్లి జ‌రిగిన‌ప్పుడు ఐశ్వ‌ర్య వ‌య‌స్సు 23 కాగా.. ధ‌నుష్ వ‌య‌స్సు 21. త‌న కంటే వ‌య‌స్సులో రెండేళ్లు చిన్న‌వాడిని ఐశ్వ‌ర్య పెళ్లాడింది. వీరి జంట ఏంట‌ని ? చాలా మంది కామెంట్ చేసినా వీరు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే స‌డెన్‌గా విడాకుల ప్ర‌క‌ట‌న చేసి అంద‌రికి షాక్ ఇచ్చారు.

ధ‌నుష్ అన్న సెల్వ రాఘ‌వ‌న్ కూడా…


ఇక ధ‌నుష్ అన్న సెల్వ రాఘ‌వ‌న్ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు. తెలుగులో వ‌చ్చిన 7 / జీ బృందావ‌న్ కాల‌నీ, ఆడువారి మాట‌ల‌కు అర్థాలే వేరులే సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 7 / జీ హీరోయిన్ సోనియా అగ‌ర్వాల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. సోనియాను 2006లో పెళ్లి చేసుకుని 2010లో విడాకులు ఇచ్చేశాడు. ఇలా అటు ధ‌నుష్‌, ఇటు ర‌జ‌నీ ఫ్యామిలీలో వ‌రుస‌గా విడాకులతో దాంప‌త్య జీవితాలు పెటాకులు అవుతున్నాయి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news