Moviesస‌మంత‌ను ఆ వ్య‌క్తి అంత టార్చ‌ర్ పెట్టాడా... ఏం చేసిందో చూడండి..!

స‌మంత‌ను ఆ వ్య‌క్తి అంత టార్చ‌ర్ పెట్టాడా… ఏం చేసిందో చూడండి..!

స్టార్ హీరోయిన్ సమంత… నాగచైతన్య కు విడాకులు ఇచ్చాక మరింత బిజీ అయిపోయింది. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న శాకుంత‌లం సినిమా తో పాటు యశోద సినిమాలో కూడా నటిస్తోంది. బాలీవుడ్లో రెండు సినిమాల్లో నటించేందుకు రెడీ అవుతోంది. మరోవైపు వెబ్ సిరీస్‌ల‌లో బోల్డ్ గా ఉండే పాత్రలో నటించేందుకు కూడా ఓకే చెప్పేసింది. మరోవైపు దర్శక, నిర్మాతలు సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలను తెరకెక్కించాలంటే ఇప్పుడు స‌మంత పెద్ద ఆప్షన్ గా మిగిలింది.

అయితే స‌మంత తాజాగా ఓ వ్య‌క్తి త‌న‌ను టార్చ‌ర్ పెట్టాడంటూ సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. స‌మంత తాజాగా పుష్ప సినిమాలో ఓ ఐటెం సాంగ్‌లో న‌టించింది. ఊ అంటావా మావా .. ఊఊ అంటావా మావా అంటూ సాగిన ఈ హాట్ ఐటెం సాంగ్ దుమ్ము రేపేసింది. స‌మంత కూడా ఎక్క‌డా త‌గ్గ‌కుండా అందాలు ఆర‌బోసింది.

యూట్యూబ్‌లో ఈ పాట‌కు రికార్డు స్థాయిలో వ్యూస్ వ‌స్తున్నాయి. ఇదంతా స‌మంత క్రేజ్ వ‌ల్లే అని చెప్పాలి. స‌మంత ఈ పాట‌లో చాలా క‌ష్ట‌ప‌డి డ్యాన్స్ చేసింది. ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ వేసిన డ్యాన్స్ మాస్ట‌ర్ క‌ఠిన‌మైన స్టెప్పులు వేయించి మ‌రీ స‌మంత‌ను బాగా క‌ష్ట‌పెట్టించాడ‌ట‌. ఆ కొరియోగ్రాఫ‌ర్ త‌న‌ను బాగా టార్చ‌ర్ పెట్టించాడ‌ని స‌మంత చెప్పింది.

ఆ పాట‌కు రిహార్స‌ల్‌తోనే డ్యాన్స్ మాస్ట‌ర్ త‌నను చంపేశాడంటూ సమంత చేసిన కామెంట్లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బాగా వైర‌ల్ అవుతున్నాయి. స‌మంత ఎంత క‌ష్ట‌ప‌డిందో ఇప్పుడు దానికి త‌గిన ప్ర‌తిప‌లం అయితే ద‌క్కింది. ఈ సాంగ్ హిట్ అవ్వ‌డంతో ఇప్పుడు స‌మంత‌కు మ‌రిన్ని స్పెష‌ల్ సాంగ్ ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news