Moviesవిడాకుల‌కు ముందే ధ‌నుష్ - ఐశ్వ‌ర్య‌కు అన్ని కోట్ల ఆస్తి కూడ‌బెట్టారా...

విడాకుల‌కు ముందే ధ‌నుష్ – ఐశ్వ‌ర్య‌కు అన్ని కోట్ల ఆస్తి కూడ‌బెట్టారా ?

ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య – హీరో ధనుష్ విడాకుల వ్యవహారం కేవలం టాలీవుడ్లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని సినిమా ఇండస్ట్రీలోని పెద్ద సంచలనంగా మారింది. ప్రస్తుతం టాప్ రెమ్యూనరేషన్ తీసుకునే ధనుష్… 18 ఏళ్ల తన వైవాహిక జీవితానికి స్వస్తి పలికి రజని కుమార్తె ఐశ్వర్య నుంచి విడిపోతాడ‌ని అసలు ఎవరు ఎప్పుడు ఊహించలేదు. ధనుష్ కూడా సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న కుటుంబం నుంచే వచ్చాడు అన్న విషయం తక్కువ మందికి మాత్రమే తెలుసు. ప్రముఖ తమిళ దర్శకుడు కస్తూరి రాజా చిన్న కుమారుడు ధనుష్.

ధనుష్ అన్నయ్య సెల్వరాఘవన్ తెలుగులో 7 / జీ బృందావన కాలనీ – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు. రెండు సంవత్సరాల ప్రేమ అనంతరం 2004 నవంబర్ 18న ఐశ్వర్య – ధనుష్ వివాహం చేసుకున్నారు. అప్పటికే ఐశ్వర్య ఇండస్ట్రీలో రజనీ కుమార్తె గా మంచి గుర్తింపు పొందారు. ఆమె దర్శకురాలిగా మాత్రమే కాకుండా నేపథ్య గాయనిగా కూడా పేరు తెచ్చుకున్నారు. తన భర్తను హీరోగా పెట్టి 3 అనే సినిమాని తెరకెక్కించారు. మొదటి సినిమాతోనే ఐశ్వ‌ర్య‌కు మంచి గుర్తింపు వచ్చింది.

ఇప్పుడు వీరిద్దరు విడిపోవడంతో కోలీవుడ్ మీడియాలో వీరిద్దరూ ఎన్ని ఆస్తులు కూడబెట్టారు ? అన్నది హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరూ ఉమ్మడిగా సంపాదించిన ఆస్తుల విలువ రెండు వందల కోట్లకు పైనే ఉంటుందని అంటున్నారు. ధనుష్ ఆస్తి ఒక్క 2020 లోనే 145 కోట్లు. గత సంవత్సరం ఇది రు. 160 కోట్లు దాటేసింది. ధనుష్ ఒక్కో సినిమాకు 7 నుంచి 8 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటాడు. గత ఐదేళ్లలో ధనుష్ నిక‌ర ఆస్తులు రెండు మిలియన్ డాలర్లకు పెరిగినట్టు కోలీవుడ్ మీడియా చెపుతోంది.

సినిమాలతో పాటు ప్రకటనలు, ఇతర వ్యాపారాలు… నిర్మాతగా కూడా ధనుష్ వ్యవహరిస్తున్నారు. ధనుష్ తన కుటుంబంతో చెన్నైలోని ఒక ఖరీదైన ఈ ప్రాంతంలో ఉండే ఇంట్లో నివసిస్తున్నాడు. ఇప్పటివరకు ధనుష్ తన భార్య ఐశ్వర్య తన ఇద్దరు కుమారులతో కలిసి ఉన్న బంగ్లా విలువే రు. 30 కోట్ల వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇక ఐశ్వర్య వృత్తిరీత్యా సంవత్సరానికి ఏడు నుంచి పది కోట్ల వరకు సంపాదిస్తుంది ఆట. ఆమె ఇప్పటి వరకు రెండు సినిమాలకు దర్శకత్వం వహించగా… రెండు నిర్మాణ సంస్థలకు కూడా డైరెక్టర్ గా వ్యవహరిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news