Moviesబ్లాక్‌బ‌స్ట‌ర్ అన్‌స్టాప‌బుల్... బాల‌య్య‌కు టాప్ రెమ్యున‌రేష‌న్‌... రెండో సీజ‌న్‌కు డ‌బుల్‌..!

బ్లాక్‌బ‌స్ట‌ర్ అన్‌స్టాప‌బుల్… బాల‌య్య‌కు టాప్ రెమ్యున‌రేష‌న్‌… రెండో సీజ‌న్‌కు డ‌బుల్‌..!

నందమూరి బాలకృష్ణ వెండితెర‌, బుల్లితెర అన్న తేడా లేకుండా దుమ్ము దులిపేస్తున్నాడు. అఖండ రికార్డులు అప్ర‌తిహ‌తంగా కంటిన్యూ అవుతున్నాయి. అఖండ‌ను ఇప్పుడు నార్త్‌లో రిలీజ్ చేయాల‌న్న డిమాండ్లు వ‌స్తున్నాయి. ఇటు ఈ నెల 28న అఖండ‌ను త‌మిళ్‌లో డ‌బ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మ‌రోవైపు బుల్లితెర‌పై బాల‌య్య టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే దుమ్ము రేపుతోంది. అస‌లు బాల‌య్య ఏంటి ? టాక్ షో ఏంటి ? అన్న‌వాళ్లు ఇప్పుడు ఆ షోకు వ‌స్తోన్న ట్రెమండ‌స్ రెస్పాన్స్ చూసి నోరెళ్ల బెడుతున్నారు.

బాల‌య్య ఎన‌ర్జీ, టాక్ షోను న‌డిపిస్తోన్న తీరు అత్య‌ధ్భుతంగా ఉంది. ఈ టాక్ షో బాల‌య్య ఇమేజ్‌ను మ‌రో మెట్టు ఎక్కించ‌డంతో పాటు ఈ త‌రం జ‌న‌రేష‌న్‌కు కూడా ఆయ‌న్ను సింపుల్‌గా క‌నెక్ట్ చేసేసింది. ఆహాలో గ‌తంలో సామంత సామ్ జామ్ షో చేసినా క్లిక్ కాలేదు. ఆ షో క్లిక్ కాక‌పోవ‌డంతోనే ఆహా రెండో సీజ‌న్‌కు వెళ్ల‌లేదు. అయితే ఇప్పుడు బాల‌య్య అన్‌స్టాప‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కావ‌డంతో పాటు ఆహాను తెలియ‌ని వాళ్ల‌కు కూడా తెలిసేలా చేసింది.

అటు నంద‌మూరి అభిమానులు కూడా ఇప్పుడు ఆహా అభిమానులు అయిపోయారు. అల్లు అర‌వింద్ మార్కెట్ స్ట్రాట‌జీ కూడా ఇక్క‌డ బాగా వ‌ర్క‌వుట్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1ను మ‌హేష్‌బాబు ఎపిసోడ్‌తో ముగిస్తున్నారు. ఆ త‌ర్వాత కాస్త గ్యాప్ తీసుకుని.. స‌మ్మ‌ర్‌లో రెండో సీజ‌న్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఫ‌స్ట్ సీజ‌న్లో బాల‌య్య అన్ని ఎపిసోడ్ల‌కు క‌లిపి రు. 5 కోట్ల‌కు కాస్త అటూ ఇటూగా రెమ్యున‌రేష‌న్ తీసుకున్న‌ట్టు టాక్ ?

ఇక రెండో సీజ‌న్‌కు కూడా బాల‌య్య దీనికి డ‌బుల్ అందుకోనున్న‌ట్టు తెలుస్తోంది. అయితే ఈ రెమ్యున‌రేష‌న్ అంతా బాల‌య్య బ‌స‌వ‌తార‌కం క్యాన్స‌ర్ ఆసుప‌త్రి కోస‌మే వినియోగిస్తున్నాడు. అల్లు అర‌వింద్ ఈ షో చేయ‌మ‌ని అడిగిన‌ప్పుడే ఈ రెమ్యున‌రేష‌న్ నాకు అవ‌స‌రం లేదు.. క్యాన్స‌ర్ ఆసుప‌త్రికే మీరు ఇస్తున్నారు అనుకోండ‌ని చెప్పేశాడు. ఇక రెండో సీజ‌న్లో ఎక్కువ ఎపిసోడ్ల‌తో పాటు టాప్ గెస్టులు ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.

Latest news