Moviesబాల‌య్య అన్‌స్టాప‌బుల్ 2 గెస్టులు వీళ్లే... ఈ సారి మ‌రింత ర‌చ్చే..!

బాల‌య్య అన్‌స్టాప‌బుల్ 2 గెస్టులు వీళ్లే… ఈ సారి మ‌రింత ర‌చ్చే..!

యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేసిన తొలి టాక్ షో అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే సూప‌ర్ స‌క్సెస్ అయ్యింది. అస‌లు ఈ షో ఈ రేంజ్‌లో స‌క్సెస్ అవుతుంద‌న్న‌ది ఎవ్వ‌రూ ఊహించ‌లేదు. ఇటు బాల‌య్య‌కు బుల్లితెర‌పైనా.. ఇంకా చెప్పాలంటే ఈ త‌రం జ‌న‌రేష‌న్‌లో కూడా తిరుగులేని క్రేజ్ రావ‌డంతో పాటు అటు ఆహా పాపులారిటీ స్కై రేంజ్‌లోకి వెళ్లిపోయింది. తొలి సీజ‌న్లో మొత్తం 10 ఎపిసోడ్లు షూట్ చేస్తూ ఈ ప‌ది కూడా సూప‌ర్ హిట్ అయ్యాయి. మోహ‌న్‌బాబు ఫ్యామిలీ, అనిల్ రావిపూడి, బ్ర‌హ్మానందం, నేచుర‌ల్ స్టార్ నాని, పుష్ప టీం, అఖండ టీం ఇలా ప్ర‌తి ఎపిసోడ్ కూడా ప‌దునైన పంచ్‌ల‌తో పేలి వీక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదం ఇచ్చింది.

ఇక మాస్ మ‌హ‌రాజ్ ర‌వితేజ లాంటి వాళ్లు కూడా ఈ షోలో స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్‌గా నిలిచారు. ఇక మ‌హేష్‌బాబుతో షూట్ చేసిన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయ్యాక ఆహా ఫ‌స్ట్ సీజ‌న్ పూర్తి కానుంది. ఇక కాస్త గ్యాప్ తీసుకుని స‌మ్మ‌ర్ నుంచి అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్ స్టార్ట్ చేసే ప్లానింగ్‌లో ఆహా ఉంది. ఫ‌స్ట్ సీజ‌న్లో రావాల్సిన కొంద‌రు గెస్టులు మిస్ అయ్యారు. ఫ‌స్ట్ సీజ‌న్‌లోనే మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్ట‌రీ వెంక‌టేష్ రావాల్సి ఉంది. వారిద్ద‌రు మిస్ అయ్యారు. సెకండ్ సీజ‌న్లో వారిద్ద‌రి ఎపిసోడ్లు ఖ‌చ్చితంగా ఉంటాయి.

ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు బాల‌య్య‌కు విబేధాలున్నాయ‌న్న ప్ర‌చారం ఉంది. ర‌వితేజ‌కు బాల‌య్య‌కు గ్యాప్ ఉంద‌న్న ప్ర‌చారానికి ఫ‌స్ట్ సీజ‌న్లో ర‌వితేజ ఎపిసోడ్‌తో చెక్ పెట్టేశారు. ఇప్పుడు సెకండ్ సీజ‌న్‌కు జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా రానున్న‌ట్టు తెలుస్తోంది. ఈ షోకు ఎన్టీఆర్ వ‌చ్చి… బాల‌య్య హోస్ట్ చేస్తే అంత‌కు మించిన సంచ‌ల‌నం ఉండ‌దు.. బాబాయ్‌, అబ్బాయ్ గ్యాప్ ఉంద‌ని ప్ర‌చారం చేసేవాళ్ల నోళ్ల‌కు తాళాలు ప‌డ‌తాయ్‌..!

ఇక చిరంజీవి – బాల‌య్య ఎపిసోడ్ కూడా వీరిద్ద‌రి కెరీర్‌కే స్పెష‌ల్ అవుతుంది. మ‌రో ట్విస్ట్ ఏంటంటే బాల‌య్య‌కు వియ్యంకుడు అయిన మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కూడా ఈ షోకు గెస్టుగా వ‌స్తార‌ని అంటున్నారు. ఓవ‌రాల్‌గా చూస్తే అన్‌స్టాప‌బుల్ సెకండ్ సీజ‌న్లో కావాల్సినంత వినోదంతో పాటు ర‌చ్చ‌ను మ‌నం చూడ‌బోతున్నాం. ఆహా ఈ సారి మ‌రింత డిఫ‌రెంట్‌గా ఈ సీజ‌న్‌ను ప్లాన్ చేస్తోంద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news