Moviesతెగించేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌... ఆ హీరోతో ఘాటైన లిప్‌లాక్‌లు..!

తెగించేసిన అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌… ఆ హీరోతో ఘాటైన లిప్‌లాక్‌లు..!

టాలీవుడ్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కెరీర్ ప్రారంభంలో వరుస హిట్లతో దూసుకుపోయింది. అప్పట్లో అనుపమకు క్రేజీ ఆఫర్లు వచ్చాయి. అయితే గత మూడు సంవత్సరాలుగా ఆమెకు సరైన అవకాశాలు రాలేదు. దీనికితోడు ఆమె నటించిన సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఆఫర్లు తగ్గిపోయాయి. తాజాగా అనుపమ పరమేశ్వరన్ నటించిన రౌడీ బాయ్స్ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాలో కొత్త హీరోకు జోడీగా ఆమె నటిస్తోంది. అనుపమ కెరీర్ ప్రారంభం నుంచి మిడిల్ రేంజ్ హీరోల పక్కన ఎక్కువగా నటించింది.

స్టార్ హీరోల సినిమాల్లో ఆమెకు పెద్దగా ఆఫర్లు రాలేదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్ళలో తాను గ్లామర్ రోల్స్ కు పూర్తిగా దూరం అని చెప్పడంతో ఆమెకు కొన్ని సినిమా అవకాశాలు రాలేదు. అయితే ఆఫర్లు తగ్గిపోవడంతో పాటు రెండు మూడు సంవత్సరాలుగా పెద్దగా ఛాన్సులు లేకపోవడంతో అనుపమ గ్లామర్ డోస్ పెంచేసింది. అందాల ఆరబోతకు గేట్లు ఎత్తి వేసింది. గత ఏడాది నుంచి ఆమె సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

గతంలో ఆమె కొన్ని సినిమాల్లో లిప్‌లాక్ సీన్ల‌లో న‌టించాల‌న్న కండీష‌న్లు రావ‌డంతో రిజెక్ట్‌ చేసింది. అయితే రౌడీ బాయ్ సినిమాలో మాత్రం అనుపమా లిప్ లాక్ సీన్లలో నటించడంతో ఇప్పుడు ఆమెకు వరుసగా అవకాశాలు వస్తాయని అంటున్నారు. ఈ సినిమాలో ఆమె చాలా ఘాటైన సీన్ల‌లోనే న‌టించింద‌ని అంటున్నారు. కేవలం అవకాశాల కోసమే అనుపమ రూటు మార్చేసిందని చర్చలు నడుస్తున్నాయి. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

గతంలో స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పుడు గ్లామర్‌గా ఉండను అని చెప్పిన అనుపమ… ఇప్పుడు ఓ కొత్త హీరోతో ఏకంగా లిప్‌లాక్‌లో నటించడంతో ఆమె అవకాశాలకోసం రేంజ్ మార్చినట్లు తెలుస్తోంది. మరి అనుపమకు ఈ సినిమా అయినా అవకాశాలు తెచ్చిపెడుతుంది ఏమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news