Moviesఆ సినిమా నా జీవితానే మార్చేసింది.. దుమ్మురేపుతున్న అనసూయ కామెంట్స్..!!

ఆ సినిమా నా జీవితానే మార్చేసింది.. దుమ్మురేపుతున్న అనసూయ కామెంట్స్..!!

తెలుగు ఇండస్ట్రీ వాళ్లకి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . ఆమె ఓ అందాల యాంకర్ . జబర్దస్త్ అనే కామెడీ షో ద్వార పాపులర్ అయ్యి ఇప్పుడు ఓ వైపు యాంకర్ గా చేస్తూనే మరో వైపు సినిమాలు చేస్తుంది. అనసూయ అంటే బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ తో ఆడియెన్స్ ను అలరిస్తున్న ఈ అమ్మడు ఏ షో చేసిన టృఫ్ లు మామూలుగా ఉండవు. షోలో కామెడీతో పాటుగా అనసూయ అందాలు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటాయి. పొట్టి పొట్టి..బిగుతైన డ్రెస్సులు..ఒంటికి అతుక్కుపోయే శారీస్..మత్తెక్కించే మాటలు…డ్యాన్సులు ఇలా అన్ని రకాలుగా కుర్రాళ్ళ హృదయాలు కొల్లగొట్టింది. అతి తక్కువ సమయంలోనే బుల్లితెరపైనే కాదు వెండి తెరపై కూడా హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.

రంగస్థలంలో రంగమత్తగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న యాంకర్‌ అనసూయ .. బడా సినిమాల్లో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఇటీవలె పుష్ప సినిమాలో నటించి మరోసారి మెప్పించింది. ‘దాక్షాయని’ పాత్రలో మంగళం శ్రీను భార్యగా సునీల్ పక్కన ఆమె చేసిన పర్ ఫామెన్స్ అద్దిరిపోయింది.

నిజానికి సినిమాలో అనసూయ కనిపించింది కొంత సమయమే అయినా ఆ పాత్రకు ఆమె ప్రాణం పోసింది. ఇక రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన పుష్ప సినిమాను దాదాపు సెలెబ్రిటీలంతా కూడా చూస్తున్నట్లు వాళ్ల సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనసూయ కూడా తన ఫ్యామిలితో పాటుగా పుష్ప సినిమాను ఇంట్లోనే చూసిన్నట్లు చెప్పుకొచ్చింది.

పుష్ప సినిమాను వీక్షిస్తోన్నట్టు తెలిపిన అనసూయ .. ” నాకు, నా సినీ కెరీర్‌కు “పుష్ప” సినిమా ఓ గేమ్ చేంజర్ లాంటిది. ఈ అవకాశం ఇచ్చిన స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ సార్‌కు చాలా థ్యాంక్స్. అందరు పుష్పను ప్రైమ్‌లో చూడండి అని” అనసూయ చెప్పుకొచ్చింది. మొత్తానికి అనసూయ పుష్ప సినిమా తనకు సక్సెస్ ఇచ్చింది అని మరీ మరీ చెప్పుకొస్తుంది. ఇక పుష్ప 2 లో అమ్మడు పర్ ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉంటాదో చూడాలి..!!

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news