Moviesబాప్‌రే..అక్షయ్ కుమార్ ఇల్లు అన్నీ కోట్లా..సెలబ్రిటీల లైఫ్ స్టైలే వేరబ్బా..!!

బాప్‌రే..అక్షయ్ కుమార్ ఇల్లు అన్నీ కోట్లా..సెలబ్రిటీల లైఫ్ స్టైలే వేరబ్బా..!!

అక్షయ్ కుమార్..అబ్బో సార్ పేరు కి అటు బాలీవుడ్ లోను ఇటు టాలీవుడ్ లోను మంచి క్రేజ్ ఉంది. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బాలీవుడ్ బడా హీరోగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ హీరో.. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకోవడం తో పాటు..కష్టం అని సహాయం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే మ్మచి మనసు ఉన్న యాక్టర్. కరోనా కాలంలోను మోదీ రిలీఫ్ ఫండ్ కి కోట్ల రూపాయలను డోనేషన్ గా ఇచ్చి ఎందరో ప్రాణాలను కపాడి కలియుగ దేవుడిగా మారాడు.

బాలీవుడ్ లో ప్రదాన హీరోలకు సైతం గట్టి పోటీ ఇచ్చే అక్షయ్ కుమార్..రెమ్యూనరేషన్ పరంగాను ఓ రేంజ్ లో తీసుకుంటాడనే టాక్ ఉంది. కోట్లాకు కోట్లు పారితోషకంగా తీసుకునే అక్షయ్ సంపాదన పరంగా కూడా తనకు తానే పోటీ అన్నట్లుగా సంపాదిస్తుంటారు. సినిమా సినిమాకి రెమ్యునరేషన్ పెంచుకుంటూపోతూ తన మార్కెట్ ను టాప్ నెంబర్ లో ఉంచుతున్నారు అక్షయ్ కుమార్. దీంతోసంపాదనలో బాలీవుడ్ ఖిలాడి అక్షయ్ కుమార్ టాప్ గా కొనసాగుతున్నాడు.

బాలీవుడ్ లో ఒక్కో సినిమాకి 100 కోట్లకు పైగానే పారితోషకం తీసుకుంటారు హీరోలు.. అక్షయ్ కుమార్,షారుక్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు అయితే రెమ్యునరేషన్ తో పాటు సినిమాలలో వాటాలు కూడా తీసుకుంటారు.. ఇవే కాకుండా వారికి యాడ్ ల రూపంలో కూడా కోట్ల రూపాయలకు ఇస్తుంటారు నిర్వాహకులు.. దీంతో వారి ఆస్తులు వందల, వేల కోట్లకు పెరిగిపోయిందని చెప్పొచ్చు.ఏడాదికి కనీసం నాలుగు సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద అలరించే అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు 120 కోట్లు తీసుకుంటూ ఏడాదిలో దాదాపుగా 400 కోట్ల దాకా సంపాదిస్తున్నాడట.

ఇక మొదటి నుండి ఇల్లు కొనదం అంటే ఇష్టమైన బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ మరో సారి ఓ కాస్ట్లీ ఇల్లుని కొన్ని టాక్ ఆప్ ది టౌన్ గా మారాడు. ముంబయ్ లోని కాస్ట్లీ ఏరియాలో .. కాస్ట్లీ హౌస్ ను కొన్న అక్షయ్ కుమార్.. దీని కోసం ఆయన 7 కోట్ల 80 లక్షల వరకూ ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది. ముంబయ్ లోని ఖార్ వెస్ట్ లోని జాయ్ లెజెంట్ భవనంలో 19వ ప్లోర్ లో ఉన్న అపార్ట్ మెంట్ ను అక్షయ్ కుమార్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. అక్షయ్ కుమార్ ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి ముంబయ్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతం జూహూలో ఓ డూప్లెక్స్ బిల్డింగ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news