Moviesభార్య అడిగిన ప్రశ్నకి..ఎన్టీఆర్ సమాధానం వింటే..శభాష్ అనాల్సిందే..!!

భార్య అడిగిన ప్రశ్నకి..ఎన్టీఆర్ సమాధానం వింటే..శభాష్ అనాల్సిందే..!!

టాలీవుడ్ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ పేరు కు ఓ ప్రత్యేకమైన స్దానం ఉంటుంది. ఒక్కప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు గారు..ఇప్పుడు యంగ్ టైగర్ తారక్ ..వీరిద్దరి గురించి ఎంత చెప్పిన అది తక్కువే అవుతుంది. అమతటి పేరును ,ఫ్యాన్స్ ను సంపాదించుకున్నారు వీళ్లు. స్వర్గీయ నందమూరి తారకరామారావు గారి మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈయన తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు. తన తాత సీనియర్ ఎన్టీఆర్ రూపాన్ని మాత్రమే కాదు… నట వారసత్వాన్ని అందిపుచ్చుకుని ఈరోజు తెలుగు సినిమా రంగంలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నారు. చిన్నతనం లోనే బాలరామాయణం సినిమాలో నటించి అందరి దగ్గర శభాష్ అనిపించుకున్న ఎన్టీఆర్..ఇప్పుడు కూడా ఢిఫరెంట్ జోనర్ లో సినిమాలు సెలక్ట్ చేసుకుంటూ అధ్బుతంగా నటిస్తూ తానేంటో ప్రూవ్ చేసుకుంటున్నారు ఎన్టీఆర్. సినిమా సినిమాకి తనలోని డిఫరెంట్ షేడ్స్ అభిమానులకు చూయిస్తూ టాప్ హీరోల లిస్ట్ ఒక్కడిగా ఉన్నాడు.

కాగా, ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి అనే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. చూడటానికి చక్కటి రూపం..భర్త పేరు నిలబెట్టే లా మన తెలుగింటి సాంప్రదాయాలను ఫాలో అవుతూ..ఎప్పుడు నిండైన బట్టలతో ఆమెను చూస్తే నమస్కరించాలి అని అనిపించేలా ఉంటుంది. నో సోషల్ మీడియా,నో ఎక్స్ పోజింగ్, నో కాంట్రవర్సీ, ఓన్లీ ఫ్యామిలీ..భర్తే తన సర్వస్వం..పిల్లల్లే తన ప్రాణం అంటూ అచ్చం తెలుగింటి గృహిణిలా ఉంటుంది ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి.

అయితే పెళ్ళైన కొత్తలో ప్రణతి ఎన్టీఆర్ ను ఓ ప్రశ్న అడిగిందట. ఈ ప్రశ్న ఆల్ మోస్ట్ అందరు భార్యలు వాళ్ల భర్తలని పలు సంధర్భాలల్లో అడిగే ఉంటారు. “నీకు మా ఇద్దరిలో ఎవ్వరు అంటే ఎక్కువ ఇష్టం..మీ అమ్మ గారు నా..లేక నేనా..?” ..ఈ ప్రశ్న ఏదో ఒక్క సంధర్భంలో ప్రతి భర్తకి ఎదురై ఉంటుంది. కూల్ గా ఉండే భర్తలు అయితే ఇద్దరు సమానమే..కోపం గా ఉండే భర్తలు అయితే ‘నీకు వేరే పనిలేదా పక్కకి పో’..తెలివైన భర్త అయితే ..”నువ్వే”..అంటూ ఆన్సర్ ఇస్తుంటాడు. ఇక ఎన్టీఆర్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా..” నాకు మా అమ్మనే ఇష్టం. ఆ తరువాత నువ్వు నా లైఫ్ లోకి వచ్చావు. నిన్ను మా అమ్మ అంత ఇష్టంగా ఇష్టపడుతున్నా. భార్యను ప్రేమించేవాడు తల్లిని ప్రేమిస్తాడొ లేదో కానీ..కన్న తల్లి ప్రేమించే ప్రతి భర్త .. భార్యలో తన అమ్మని చూసుకుంటాడు.” అంటూ చెప్పారట. దీంతో ప్రణతి ఎమోషనల్ అయ్యిందట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news