Moviesరేణుదేశాయ్ రెండో పెళ్లికి ఎందుకు ఆగిపోయింది.. ఏం జ‌రిగింది...?

రేణుదేశాయ్ రెండో పెళ్లికి ఎందుకు ఆగిపోయింది.. ఏం జ‌రిగింది…?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం చేసినా సంచలనమే. పవన్ వ్యక్తిగత, రాజకీయ జీవితం ఎప్పుడూ ఏదో ఒక అంశంతో వార్తల్లోనే ఉంటుంది. ఈ ఏడాది వ‌కీల్‌సాబ్‌ సినిమాతో మంచి హిట్ కొట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతున్నారు. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో రానా మ‌రో హీరోగా తెరకెక్కుతున్న భీమ్లానాయ‌క్‌ ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మ‌ల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్య‌ప్ప కోషియ‌మ్‌ సినిమాకు రీమేక్‌గా భీమ్లానాయ‌క్ సినిమా వస్తోంది.

ఈ సినిమా తర్వాత క్రిష్ దర్శకత్వంలో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు సినిమా ప‌వ‌న్ చేస్తున్నారు. ఆ తర్వాత ప‌వ‌న్ నుంచి మరో మూడు సినిమాలు లైన్ లో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే 2024 ఎన్నికల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ వ‌రుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. సినిమా షూటింగ్‌ల‌తో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలలో కూడా జనసేన పార్టీని న‌డిపిస్తున్నారు.

ఇక ప‌వ‌న్ రెండో భార్య రేణుదేశాయ్ ప‌వ‌న్‌కు విడాకులు ఇచ్చాక పూణేలో త‌న పిల్ల‌లు, త‌ల్లిదండ్రుల‌తో క‌లిసి ఉంటోంది. యేడాదిన్న‌ర క్రితం రేణుదేశాయ్ రెండో పెళ్లి చేసుకుంటున్న‌ట్టు హింట్ ఇచ్చింది. సోష‌ల్ మీడియాలో ఎంగేజ్‌మెంట్ ఫొటోలు అని పోస్ట్ చేసింది. ప‌వ‌న్ మ‌రో వ్య‌క్తిని రెండో పెళ్లి చేసుకుని.. త‌న స‌రికొత్త వైవాహిక జీవితం ఆరంభించ‌బోతోంద‌ని వార్త‌లు కూడా వ‌చ్చాయి. అంత‌లోనే ఏమైందో గాని స‌డెన్‌గా ఈ పెళ్లి గురించి త‌ర్వాత ఎలాంటి వార్త‌లు లేవు.

ఎంగేజ్‌మెంట్ త‌ర్వాత ఈ పెళ్లి క్యాన్సిల్ అయ్యింద‌ని కొంద‌రు చెపుతున్నారు. ఇక రేణు, ప‌వ‌న్ నుంచి విడిపోయినా కూడా ఆమె మ‌న‌సంతా ప‌వ‌న్‌తోనే ఉంద‌ని అంటారు. ప‌వ‌న్ కూడా వీలున్న‌ప్పుడ‌ల్లా పూణే వెళ్లి అక్క‌డ త‌న పిల్ల‌ల‌తో గ‌డిపి వ‌స్తుంటారు. ఇక మెగా ఫ్యామిలీలో ఏ ఫంక్ష‌న్ జ‌రిగినా కూడా అకీరా నంద‌న్ హాజ‌రవుతూ ఉంటాడు. మ‌రోవైపు చిరు సైతం అకీరాను తెలుగులో హీరోగా ఇంట్ర‌డ్యూస్ చేయాల‌ని తాప‌త్ర‌య ప‌డుతున్నార‌ట‌.

ప‌వ‌న్ – రేణు భౌతికంగా దూర‌మైనా మాససికంగా విడిపోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో పాటు అనేక కార‌ణాల‌తోనే రేణు దేశాయ్ ప‌వ‌న్‌పై కోపం ఉన్నా కూడా రెండో పెళ్లి చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌.. ఎంగేజ్‌మెంట్ క్యాన్సిల్ చేసుకుంద‌ని అంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news