Moviesజయలలిత గురించి శోభన్ బాబు ఆఖరి రోజుల్లో ఎంచెప్పాడంటే..!!

జయలలిత గురించి శోభన్ బాబు ఆఖరి రోజుల్లో ఎంచెప్పాడంటే..!!

సినీ ఇండస్ట్రీలో శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆంధ్ర సోగ్గాడుగా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకున్న శోభన్ బాబు.. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి పరిమితమవుతూ.. ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందారు. శోభన్ బాబు మహిళా ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అప్పట్లో ఈయన సినిమా రిలీజ్ అవుతుంది అంటే ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ తో సినిమా హాళ్లు నిండిపోయేవి. అంతటి క్రేజ్ ఉంది ఈయనకు. ఇక అప్పట్లో శోభన్ బాబు, జయలలితకు మధ్య గల అనుబంధం హాట్ టాపిక్ గా ఉండేది.

ఇద్దరి మధ్య ప్రేమ నడుస్తోందని, వారి ప్రేమ బంధానికి గుర్తుగా ఒక పాప కూడా జన్మించిందని పుకార్ల మీద పుకార్లు నడిచాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలు అలనాడు పలు సినీ మ్యాగజీన్లలో హల్ చల్ చేసిన సంగతి నిన్నటి తరం వారికి తెలుసు. ఇకపోతే శోభన్ బాబు, జయలలిత కలిసి నటించిన ఒకే ఒక్క సినిమా డాక్టర్ బాబు. శోభన్ బాబు సినిమాల్లోకి వచ్చేసరికే జయలలితకు తమిళ, తెలుగు ఇండస్ట్రీలలో మంచి పేరు ప్రఖ్యాతులున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన ఏ హీరో అయినా జయలలితతో నటించాలని తపించేవారు. శోభన్ బాబు కూడా ఆమెతో నటించేందుకు తెగ తాపత్రయపడేవారు.

ఆమెతో నటించే అవకాశం ఒకసారి వచ్చినట్లే వచ్చి చేజారిపోయిన శోభన్ దిగాలుపడిపోయారు. ఆ తరువాత తిరిగి ఎనిమిదేళ్ల తరువాత ఆ అవకాశం డాక్టర్ బాబు చిత్రంతో లభించడంతో శోభన్ ఉబ్బితబ్బిబ్బయిపోయారు.కానీ బ్యాడ్ లక్ ఏంటంటే శివ షూటింగ్ ప్రారంభం కావడానికి కొద్ది రోజుల ముందు జయలలిత తల్లి మరణించింది. దీంతో తల్లి ఉన్నంత వరకు జయలలితకు సంబంధించిన అన్ని విషయాలు ఆమె చూసుకునేది. ఆ తర్వాత శోభన్ బాబు లో ఆమె తన తల్లిని చూసుకునేదని సన్నిహిత బంధువులు చెప్పేవారు.

ఇక ఇదే విషయాని శోభన్ బాబు తన డైరీలో రాసుకున్నారట. జయలలిత శోభన్ బాబుతో ఏం చెప్పారో అది అలానే ఆయన రాసుకొచ్చారట. శోభన్ బాబు..డైరీలో ..”జయలలిత బంధువులను తన వాళ్లనుకొని, వాళ్లకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తే.. తనని కొన్ని లక్షలు మోసం చేసి దోచుకున్నారట. అలాంటి పరిస్ధితుల్లో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నాకు తెలియడం లేదని ఆమె తెలిపిందట. ఇలాంటి వాళ్ల అమ్మగారు పోయాక ఎన్నో బాధలు పడుతున్న ఆమెకు శోభన్ బాబు వచ్చాక అలాంటి బాధ లేదని.. తెలియజేసింది” అంటూ ఆ డైరీలో రాసుకున్నాడు శోభన్ బాబు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news