ReviewsTL ప్రీ రివ్యూ: అఖండ‌

TL ప్రీ రివ్యూ: అఖండ‌

టైటిల్‌: అఖండ‌
బ్యాన‌ర్‌: ద్వార‌కా క్రియేష‌న్స్‌
న‌టీన‌టులు: నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌గ్య జైశ్వాల్‌, జ‌గ‌ప‌తిబాబు, శ్రీకాంత్, ప్ర‌భాక‌ర్ త‌దిత‌రులు
సినిమాటోగ్ర‌ఫీ: సీ రామ్ ప్ర‌సాద్‌
మ్యూజిక్ : థ‌మ‌న్‌. ఎస్‌
ఆర్ట్ డైరెక్ట‌ర్‌: ఏఎస్ ప్ర‌కాష్‌
ఎడిటింగ్‌: కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, త‌మ్మిరాజు
ఫైట్స్‌: స్ట‌న్ శివ‌, రామ్‌, ల‌క్ష్మ‌ణ్‌
నిర్మాత‌: మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి
ద‌ర్శ‌క‌త్వం: బోయ‌పాటి శ్రీను
సెన్సార్ రిపోర్ట్‌: U / A
రిలీజ్ డేట్‌: 02 డిసెంబ‌ర్‌, 2021

ప‌రిచ‌యం:
యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ తాజా చిత్రం అఖండ‌. డిసెంబ‌ర్ 2న థియేట‌ర్ల‌లోకి రాబోతోన్న ఈ సినిమాపై ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో తెలిసిందే. బాల‌య్య – బోయపాటి శ్రీను కాంబినేష‌న్లో వ‌చ్చిన సింహా, లెజెండ్ రెండూ ఒక‌దానిని మించి మ‌రొక‌టి సూప‌ర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఖ‌చ్చితంగా అఖండ బ్లాక్ బ‌స్ట‌ర్ అవుతుంద‌ని అంచ‌నాలు భారీగా ఉన్నాయి. క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌లోకి వ‌స్తోన్న పెద్ద సినిమా అఖండ‌. అందుకే ఈ సినిమా కోసం యావ‌త్ తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తోంది. మ‌రోవైపు బాల‌య్య నుంచి రూల‌ర్ త‌ర్వాత సినిమా రాలేదు. ఈ సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టి తిరిగి ఫామ్‌లోకి వ‌స్తాడ‌నే ఆయ‌న అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రి అఖండ క‌థ‌, క‌థ‌నాలు, అంచ‌నాలు ఎలా ఉండ‌బోతున్నాయో TL ప్రి రివ్యూలో చూద్దాం.

క‌థ అంచ‌నా:
అఖండ క‌థ అఘోరాల చుట్టూ తిరుగుతుంద‌ని టీజ‌ర్లు, ట్రైల‌ర్లు చెపుతున్నాయి. శివుడిని అభిషేకించి కుంటూ గుహ‌ల్లో ఉండే అఘోరాకు మామూలు రోల్ చేసిన బాల‌య్య‌కు ఉన్న లింక్ ఏంటి ? సాధార‌ణ మ‌నిషి అఘోరాగా ఎందుకు మారాడు ? ఈ రెండు పాత్ర‌లు వేర్వేరా ? లేదా ఒక్క‌టేనా ? బ‌ల‌మైన ఫ్యాక్ష‌న్ క‌థాంశంగా అఖండ ఎలా ఉండ‌బోతోంది ? అన్న ప్ర‌శ్న‌ల‌కు రేపు సినిమా రిలీజ్ అయ్యాక ఆన్స‌ర్ దొర‌క‌నుంది.

న‌టీన‌టుల పెర్పామెన్స్ అంచ‌నా :
బాల‌య్య న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఈ సినిమాలో త‌న గ‌త క్యారెక్ట‌ర్ల‌కు భిన్నంగా అఘోర పాత్ర‌లో న‌టించారు. ఈ పాత్ర సినిమాకే హైలెట్‌గా నిలుస్తుంద‌ని చెపుతున్నారు. అఘోరా డైలాగులు చూస్తుంటూనే భీక‌రంగా ఉన్నాయి. ఆ ఆహారం కూడా బాల‌య్య‌కే సెట్ అయిన‌ట్టు క‌నిపిస్తోంది. అఘోరాతో పాటు రెండో క్యారెక్ట‌ర్లో కూడా బాల‌య్య వైవిధ్యంగా న‌టించారు. ఇక ప్ర‌గ్య జైశ్వాల్ గ్లామ‌ర్‌తో పాటు న‌ట‌న‌కు స్కోప్ ఉన్న పాత్ర‌లో న‌టించింద‌ని తెలుస్తోంది.

బాల‌య్య లాంటి సీనియ‌ర్ హీరోతో ఆమె అటు అంద‌చందాలు ఆర‌బోత‌తో పాటు బ‌ల‌మైన పాత్ర చేసింది. ఇక సీనియ‌ర్ హీరో శ్రీకాంత్‌కు లెజెండ్‌లో జ‌గ‌ప‌తిబాబులా ఈ సినిమా ట‌ర్నింగ్ పాయింట్ అయ్యేలా ఉంది. శ్రీకాంత్ చెపుతోన్న డైలాగులు, క్రూర‌మైన విల‌న్ లుక్ చూస్తుంటే బాల‌య్య‌తో పోటీ ప‌డి న‌టించే ప‌వ‌ర్ ఫుల్ విల‌న్ రోల్ అని స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఇక జ‌గ‌ప‌తిబాబు అఘోరాగా క‌నిపిస్తున్నారు. ఇక కాల‌కేయ ప్ర‌భాక‌ర్‌, ఇత‌ర న‌టుల పాత్ర‌ల‌కు కూడా ప‌వ‌ర్ ఫుల్‌గా ప్రాధాన్యం ఉంద‌ని క‌నిపిస్తోంది.

టెక్నిక‌ల్ డిపార్ట్‌మెంట్ అంచ‌నా :
అఖండ‌కు టెక్నిక‌ల్‌గా ప్ర‌తి ఒక్క టెక్నీషియ‌న్ టాప్ లేచిపోయేలా ప‌నిచేశారు. థ‌మ‌న్ పాట‌లు వింటుంటే మ‌నం బాల‌య్య‌ను 20 ఏళ్లు వెన‌క్కి వెళ్లి చూస్తాం. రేపు తెర‌మీద అదిరిపోయే విజువ్స‌ల్ వీటికి తోడు అయితే సినిమాను స‌గం హిట్ చేస్తాయి. బాల‌య్య సినిమాల‌కు సీ రామ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ ప్రాణం పెట్టి ప‌నిచేసేలా ఉంటుంది. రామ్ ప్ర‌సాద్‌కు మాత్ర‌మే బాల‌య్య‌ను ఎంత బాగా చూపించాలో తెలుసు అనే రేంజ్లో విజువ‌ల్స్ ఉన్నాయి. ఎం. ర‌త్నం డైలాగ్స్‌కు థియేట‌ర్లు పేలిపోనున్నాయి. ఇక ఈ సినిమాకు ఇద్ద‌రు సీనియ‌ర్ ఎడిట‌ర్లు కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, గౌతంరాజు వ‌ర్క్ చేశారు. ఎడిటింగ్ వ‌ర్క్ క్రిస్పీగా, స్పీడ్‌గా మూవ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

డైలాగుల‌కు థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాల్సిందే…
ఇప్ప‌టికే రిలీజ్ అయిన డైలాగులు వింటుంటే పూన‌కాలు వ‌చ్చేస్తున్నాయి. రేపు థియేట‌ర్లో ప్ర‌తి సీన్‌కు ప‌వ‌ర్ ఫుల్ డైలాగులు పేలిపోనున్నాయి. ఎం. ర‌త్నం డైలాగుల‌తో థియేట‌ర్ల‌లో బాల‌య్య ఫ్యాన్స్ కేక‌లు, విజిల్స్ మామూలుగా ఉండేలా లేవు. ఇప్ప‌టికే పేలిపోతున్న డైలాగుల‌ను ఓ సారి చూస్తే..

బాల‌య్య డైలాగ్స్ !
– అంచ‌నా వేయ‌డానికి నువ్వేమైనా పోల‌వ‌రం డ్యామా.. ప‌ట్టిసీమ తూమా పిల్ల కాలువ‌
– ఒక మాట నువ్వంటే శ‌బ్దం.. అదే మాట నేనంటే శాస‌నం.. దైవ శాస‌నం
– ఒక‌సారి డిసైడ్ అయ్యి బ‌రిలోకి దిగితే బ్రేకుల్లేని బుల్డోజ‌ర్‌ని.. తొక్కిపాడ ద‌బ్బుతా .. లెఫ్టా రైటా టాపా.. బాట‌మా . ఇంచ్ బాడీ దొర‌క‌దు కొడ‌కా ..!
– మీకు స‌మ‌స్య వ‌స్తే దండం పెడ‌తారు.. మేం ఆ స‌మ‌స్య‌కే పిండం పెడ‌తాం..బోత్ ఆర్ నాట్ సేఫ్‌
– ఎదుటి వాడితో మాట్లాడేట‌ప్పుడు ఎలా ? మాట్లాడాలో నేర్చుకో.. శీను గారు మీ నాన్న గారు బాగున్నారా ? అనేదానికి.. నీ అమ్మ మొగుడు బాగున్నాడా ? అనే దానికి చాలా తేడా ఉందిరా లంబిడి కొడ‌కా ?

శ్రీకాంత్ డైలాగ్స్‌:
నాకు బుర‌ద అంటింది.. నాకు దుర‌ద వ‌చ్చింది.. నాకు బ్ల‌డ్ వ‌చ్చింది. నాకు గ‌డ్డ వ‌చ్చింది.. అని అడ్డ‌మైన సాకులు చెపుతూ ప‌నాపితే

బోయ‌పాటి డైరెక్ష‌న్ క‌ట్స్ అంచ‌నా:
ఇక మాస్ సినిమాల‌ను తెర‌కెక్కించ‌డంలో కేరాఫ్ అడ్ర‌స్ అయిన బోయ‌పాటి శ్రీను ఈ ద‌శాబ్ద‌కాలంలో బాల‌య్య‌ను ఫ్యాన్స్ ఎలా చూడాల‌నుకుంటున్నారో అదే రేంజ్‌లో చూపిస్తున్నారు. గ‌త 20 ఏళ్ల‌లో బి.గోపాల్ త‌ర్వాత బాల‌య్య‌ను ఆ రేంజ్‌లో చూపించిన ఘ‌న‌త బోయ‌పాటికే ద‌క్కుతుంది. ఇక అఖండ లో టీజ‌ర్లు, విజువ‌ల్స్ చూస్తుంటే మ‌రోసారి అదిరిపోయే మాస్ జాత‌ర‌ను మ‌నం ఎంజాయ్ చేస్తున్నాం అని తేలిపోయింది. ఇక బోయ‌పాటి అఖండ గ‌ర్జ‌న ఎలా ఉంటుందో ఒక్క‌డే మ‌నం తెర‌మీద చూడాలి.

ఫైన‌ల్‌గా…
యేడాది కాలంగా బాల‌య్య అభిమానుల‌ను ఊరిస్తూ వ‌స్తోన్న అఖండ గ‌ర్జ‌నకు మ‌రి కొద్ది గంట‌ల టైం మాత్ర‌మే మిగిలి ఉంది. క‌రోనా సెకండ్‌వేవ్ త‌ర్వాత వ‌స్తోన్న అఖండ గ‌ర్జ‌నతో థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లాల‌ని మ‌ళ్లీ తెలుగు సినిమాకు ఈ సినిమాతో మంచి ఊపు రావాల‌ని తెలుగులైవ్స్‌. కామ్ మ‌నస్ఫూర్తిగా కోరుకుంటూ… అఖండ సినిమా హిట్ అవ్వాల‌ని ఆ సినిమా యూనిట్‌కు, నంద‌మూరి ఫ్యాన్స్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తోంది.

అఖండ రివ్యూ కోసం చూస్తూనే ఉండండి telugulives.com

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news