Moviesఆ హీరో దెబ్బకి తట్టుకోలేక ఇండస్ట్రీనే వదిలేసిన ఈ స్టార్ హీరోయిన్.....

ఆ హీరో దెబ్బకి తట్టుకోలేక ఇండస్ట్రీనే వదిలేసిన ఈ స్టార్ హీరోయిన్.. !!

ముంబై బ్యూటీ సాక్షి శివానంద్ ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బికిని దుస్తులు ధరించి తన అందాలను ఆరబోసి కుర్రకారు మతి పోగొట్టినటువంటి ముంబై బ్యూటీ సాక్షి శివానంద్ తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు, సీనియర్ హీరో రాజశేఖర్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, తదితర స్టార్ హీరోల సరసన నటించి సినీ ప్రేక్షకులని బాగానే అలరించింది.

1996లో బాలీవుడ్లోకి మొట్టమొదటి సారిగా అడుగు పెట్టి, ఆ తరువాత తెలుగులో సినిమా అవకాశాలు రావడంతో అక్కడి నుంచి మంచి పేరు తెచ్చుకుంది. ఈమె తెలుగులో నటించిన మొదటి సినిమా చిరంజీవి కథానాయకుడిగా వచ్చిన మాస్టర్.

ఇక ఆ సినిమా మంచి హిట్ అవ్వడంతో పాటు అమ్మడు యాక్టింగ్ కు మంచి మార్కులుపడడంతో తెలుగులో ప్రముఖ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంది. అంతే కాకుండా సాక్షి శివానంద్ అక్కినేని నాగార్జునతో సీతారామరాజు, మహేష్ బాబు యువరాజు, బాలకృష్ణ వంశోద్ధారకుడు, రాజశేఖర్ సింహ రాశి, మోహన్ బాబు యమజాతకుడు వంటి సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సాక్షి శివానంద్ కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళం, మలయాళం సినిమాలలో నటించి, ఆమెకు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సాక్షి శివానంద్ ముంబై కి చెందినవారు.

అంతా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో తెలుగు సినిమా పరిశ్రమకు చెందినటువంటి బడా హీరో కుటుంబంతో ఆమెకు జరిగిన గొడవ కారణంగా హీరోయిన్ సాక్షి శివానంద్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని వదిలి పెట్టి వెళ్ళిపోయిందని అప్పట్లో పలు కథనాలు బలంగా వినిపించాయి. స్టార్ హీరో కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రంలో హీరోయిన్ సాక్షి శివానంద్ సోదరి శిల్పా శివానంద్ హీరోయిన్ గా నటించగా..

ఈ చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరో తండ్రి ఏకంగా సాక్షిశివానంద్ చెల్లెలు ని కొటారట. అంతేకాదు ఆమె కుటుంబాన్ని బెదిరించాడని దాంతో దీంతో సాక్షిశివానంద్ ఈ విషయాని సినీ పెద్దలకు చెప్పినా ప్రయోజనం లేకుండాపోయిందని. ఇక ఆ హీరో బెదిరింపిలి తట్టుకోలేక తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైకి వెళ్లిపోయిందని పలు కథనాలు సోషల్ మీడియాలో వినిపించాయి.

సాక్షి శివానంద్, సాగర్ అనే అతనితో వివాహం చేసుకుని, సాక్షి శివానంద్ సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండదు. అందుకే తన వ్యక్తిగత విషయాల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఎక్కువగా బయటకు రాదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news