Moviesఇదెక్కడి తలనొప్పి..పెళ్లికి వెళ్లడానికి ఇన్ని కండీషన్స్ నా..బాబోయ్..!!

ఇదెక్కడి తలనొప్పి..పెళ్లికి వెళ్లడానికి ఇన్ని కండీషన్స్ నా..బాబోయ్..!!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ క‌త్రినా కైఫ్, బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశ‌ల్ పెళ్లి ఇప్పుడు బాలీవుడ్‌లోనే కాదు యావ‌త్ దేశ‌వ్యాప్తంగా పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. వీరి పెళ్లి ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్నాయి. రాజ‌స్థాన్‌ స‌వాయి మ‌దోపూర్‌లోని సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బ‌ర్వారాలో వెడ్డింగ్ జ‌రుగనుంది. డెకో ఈవెంట్స్ ఈ సెర్మ‌నీ ఏర్పాట్ల‌ను చూస్తోంది. క‌త్రినా కైఫ్ త‌న అందంతో యావ‌త్ దేశాన్ని ప‌దిహేను సంవ‌త్స‌రాలుగా ఓ ఊపు ఊపేస్తోంది. ముదురు వ‌య‌స్సు వ‌చ్చినా కూడా క‌త్రినా అందం ఏ మాత్రం వ‌న్నె త‌గ్గ‌లేద‌నే చెప్పాలి. తెలుగులో క‌త్రినా కేవ‌లం రెండు సినిమాల్లో మాత్ర‌మే న‌టించినా ఆమెకు ఇక్క‌డ కూడా విప‌రీత‌మైన క్రేజ్ ఉంది. క‌త్రినా తెలుగులో బాల‌య్య ప‌క్క‌న అల్ల‌రి పిడుగు సినిమాతో పాటు వెంక‌టేష్‌తో క‌లిసి మ‌ల్లీశ్వ‌రి సినిమా చేసింది.

బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ ప్రస్తుతం విక్కీ కౌశల్ తో ప్రేమ‌లో మునిగి తేలుతోంద‌న్న వార్త నేష‌న‌ల్ వైడ్‌గా ఎంత‌లా హాట్ టాపిక్‌గా మారిందో తెలిసిందే. ఈ జంట విదేశీ టూర్లూ, బీచ్‌ల‌లో సంద‌డి, ముంబైలో సినిమాలు, షికార్లు మామూలుగా ఎంజాయ్ చేయ‌డం లేదు. పైగా బాలీవుడ్లో సెల‌బ్రిటీల పార్టీల‌కు కూడా వీరు చెట్టాప‌ట్టాలేసుకుని హాజ‌రు అవుతున్నారు. ఇక విక్కీ కూడా క‌త్రీనాతో పోలిస్తే వ‌య‌స్సులో చాలా చిన్న‌వాడే. అయితే వీరి పెళ్లికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు అన‌ధి కారిక విష‌యాలే త‌ప్పా.. అధికారిక విష‌యాలు అయితే బ‌య‌ట‌కు రాలేదు.

ఇక ఈ పెళ్లికి చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే ఆహ్వానాలు అందాయ‌ని అంటున్నారు. కాగా ఇక్కడే ఓ విషయ, అందరిని ఇబ్బందులకు గురి చేస్తుంది. క‌త్రినా కైఫ్, విక్కీ కౌశ‌ల్ పెళ్లికి వెళ్లాలి అనుకునే వాళ్లు.. కొన్ని రూల్స్ పెట్టారట ఈ కాబోయే భార్యభర్తలు. పెళ్ళి మండపానికి వచ్చేవారు మొబైల్ ఫోన్స్ లోపలికి తీసుకోరాకుడదు అనే కండీషన్ పెట్టారట.

నిర్దేశించిన పాయింట్‌లో మొబైల్ ఫోన్లను అక్కడ సిబ్బిందై కలెక్ట్ చేసుకుంటారట. మళ్లీ రిటర్న్ అయ్యేటప్పుడు వాళ్ల ఫోన్లను వాళ్లు తీసుకోవచ్చట. అసలు ఈ కండీషన్ ఎందుకంటే క‌త్రినా, విక్కీ కౌశ‌ల్‌ను ఫొటోలు కానీ, వీడియోలు కానీ తీయ్యకుండా ఇలా ప్లాన్ చేసారట. వెడ్డింగ్‌ను గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకుందామ‌నుకుంటున్న అభిమానులకు క‌త్రినా-విక్కీ కౌశ‌ల్ పెట్టిన రూల్స్ మింగుడుప‌డటం లేద‌ట‌.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news