Moviesటాలీవుడ్‌లో 3 పాత్ర‌ల కంటే ఎక్కువ పాత్ర‌ల్లో మెప్పించిన హీరోలు వీళ్లే..!

టాలీవుడ్‌లో 3 పాత్ర‌ల కంటే ఎక్కువ పాత్ర‌ల్లో మెప్పించిన హీరోలు వీళ్లే..!

తెలుగు సినిమా ఇండస్ట్రీ మొదలైన కొత్తలో ఎన్టీఆర్ , ఏఎన్నార్, కృష్ణ లాంటి సీనియర్ హీరోలు రెండు లేదా మూడు పాత్రల్లో కూడా నటించే వారు. అప్పట్లో డ‌బుల్ పోజ్‌ సినిమాలకు ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఒక్క టాలీవుడ్ లో మాత్రమే కాదు బాలీవుడ్. కోలీవుడ్లో కూడా ఒకే హీరో రెండు పాత్రల్లో నటించడం అంటే గొప్ప విషయంగా ఉండేది. ఇలాంటి పాత్రలకు క్రేజ్ ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత ద‌శ‌కాల్లో డబల్ పోజ్‌ పాత్రలకు కాస్త క్రేజ్ తగ్గినా… ఇప్పుడు యువ హీరోలు మళ్లీ రెండు, మూడు పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నారు.

సీనియర్ హీరోలలో అయితే కొందరు ఒకే సినిమాలో మూడు లేదా అంతకు మించిన పాత్రలు్లో న‌టించిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి, ఎవరెవరు మూడు పాత్రల్లో నటించి మెప్పించారో ? వారి గురించి తెలుసుకుందాం. సీనియర్ ఎన్టీఆర్ దాన వీర శూర కర్ణ సినిమాలో మూడు కీలక పాత్రలో అదరగొట్టేశారు. శ్రీకృష్ణుడిగా – కర్ణుడు – దుర్యోధనుడు నటించిన ఎన్టీఆర్ ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకుడిగా కూడా వ్యవహరించారు, అలాగే కుల‌గౌరవం సినిమాలో తాత, తండ్రి, మనవడిగా నటించి మెప్పించారు.

శ్రీమద్విరాటపర్వం – శ్రీకృష్ణసత్య – మేజర్ చంద్రకాంత్ – అడవిరాముడు వంటి సినిమాల్లో కూడా ఎన్టీఆర్ మూడు మించిన పాత్రలో నటించారు. ఇక దివంగత లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు నవరాత్రి సినిమాలో 9 పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు. ఇక మరో సీనియర్ హీరో సూపర్ స్టార్ కృష్ణ కూడా కుమార్ రాజా – రక్తసంబంధం – పగబట్టిన సింహం – బంగారు కాపురం – బొబ్బిలి దొర ఇలా ఏడు సినిమాల్లో మూడు పాత్రల్లో నటించి మెప్పించారు.

ఇక శోభన్ బాబు ముగ్గురు మొనగాళ్ళు సినిమాల్లో మూడు పాత్రల్లో నటించారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ముగ్గురు మొనగాళ్లు సినిమాలో మూడు పాత్రల్లో నటించారు. ఇక సీనియర్ హీరో కమలహాసన్ విచిత్ర సోదరులు సినిమాలో మూడు పాత్రల్లో నటించగా… మైఖేల్ మదన కామ రాజు సినిమాలో నాలుగు పాత్రల్లో అలరించారు. కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన దశావతారం సినిమాలో అయితే ఏకంగా పది పాత్రలు చేసి అదరగొట్టేశారు.

యువరత్న నందమూరి బాలకృష్ణ అధినాయకుడు సినిమాలో తాత, తండ్రి, మ‌న‌వ‌డిగా నటించారు. యంగ్‌టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో వచ్చిన జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు పరశురామ్ దర్శకత్వంలో నటిస్తున్న స‌ర్కారు వారి పాట‌ సినిమాలో కూడా మూడు పాత్రల్లో కనిపించబోతున్నార‌ని వార్తలు వస్తున్నాయి. సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట సినిమా లో పాపారాయుడు – పెద్దరాయుడు – ఆండ్రాయిడు అనే మూడు పాత్రల్లో నటించి నవ్వించారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news