Moviesటాలీవుడ్ స్టార్ హీరోకు రు. 3 కోట్ల‌కు కుచ్చుటోపీ పెట్టిన శిల్పా...

టాలీవుడ్ స్టార్ హీరోకు రు. 3 కోట్ల‌కు కుచ్చుటోపీ పెట్టిన శిల్పా చౌద‌రి

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో శిల్పా చౌదరి అనే పేరు బాగా వైర‌ల్ అవుతోంది. ఇండ‌స్ట్రీకి చెందిన ప‌లువురు ప్ర‌ముఖుల‌ను న‌మ్మించి ఆమె వారి నుంచి కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసింది. ర‌క‌ర‌కాల వ్యాపారాలు, చిట్టీలు, రియ‌ల్ ఎస్టేట్ పెట్టుబ‌డుల పేరుతో శిల్పా బ‌డా బ‌డా స్టార్ హీరోల ఫ్యామిలీల‌నే న‌మ్మించి బాగా వ‌సూలు చేసింది. ఆమె ఇండ‌స్ట్రీ వారితో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు, వ్యాపార వేత్త‌ల‌ను కూడా మోసం చేసింది. సింపుల్‌గా వీకెండ్ పార్టీల పేరుతో ప‌లువురిని వ‌ల‌లో వేసుకున్న ఆమె అలా వారితో ప‌రిచ‌యాలు పెంచుకుని మొత్తంగా రు. 200 కోట్లు వ‌సూలు చేసింది.

ఇండ‌స్ట్రీ వ్య‌క్తుల‌ను అధిక వ‌డ్డీలు ఇప్పిస్తానంటూ న‌మ్మించింది. దీంతో వారు కూడా ఆమె మాయ‌లో ప‌డిపోయారు. శిల్పా చౌద‌రి చేతిలో మోస‌పోయిన వారిలో నిర్మాత‌ల తో పాటు స్టార్ హీరో మ‌హేష్‌బాబు సోద‌రి ప్రియ‌ద‌ర్శిని కూడా ఉన్నారు. ఆమె శిల్పా కు ఏకంగా రు 2.90 కోట్లు ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. శిల్ప మోసాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు రావ‌డంతో చివ‌ర‌కు ప్రియ‌ద‌ర్శిని కూడా డేర్ చేసి మ‌రీ బ‌య‌ట‌కు వ‌చ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. ఇక ఇప్పుడు ఆమె బాధితుల్లో మ‌రో యంగ్ హీరో కూడా ఉన్న‌ట్టు తెలిసింది.

ఆ యంగ్ హీరో ఎవ‌రో కాదు హ‌ర్ష్ క‌నుమిల్లి. సెహ‌రి సినిమాతో హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు హ‌ర్ష్‌. ఆ సినిమాకు సంబంధించి ఓ ఈవెంట్లో సీనియ‌ర్ హీరో బాల‌య్య కూడా స్వ‌యంగా పాల్గొన‌డంతో సినిమాకు కాస్త బ‌జ్ వ‌చ్చింది. ఆ సినిమా షూటింగ్ టైంలో హ‌ర్ష‌తో ప‌రిచ‌యం పెంచుకున్న శిల్ప‌.. స్థ‌లం పేరు చెప్పి అత‌డి నుంచి ద‌ప‌ద‌ఫాలుగా మొత్తం రు. 3 కోట్లు వ‌సూలు చేసింద‌ట‌. ఇక ఇప్పుడు ఆ మూడు కోట్లు కూడా పోయిన‌ట్టే.

మ‌రో ట్విస్ట్ ఏంటంటే శిల్పా చేతిలోనే మోస‌పోయిన వారిలో టాలీవుడ్‌కు చెందిన ఓ అగ్ర హీరో కూడా ఉన్నాడ‌ని టాక్ ? శిల్పా చౌద‌రి ఆ అగ్ర‌హీరోతో క‌లిసి తీసుకున్న ఫోటోలు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. అయితే కార‌ణం ఏంటో కాని.. ఆమె బాధితులు ఇండ‌స్ట్రీలో చాలా మంది ఉన్నారు. అయితే వారు ఎవ్వ‌రూ కూడా తెర వెన‌క ఆమెతో సెటిల్ చేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారే త‌ప్పా కేసు పెట్టేందుకు ఎవ్వ‌రూ ముందుకు రావ‌డం లేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news