Moviesష‌ణ్ముక్ జ‌శ్వంత్ - దీప్తి బ్రేక‌ప్ అయిపోయిన‌ట్టే... క్లారిటీ ఇదిగో...?

ష‌ణ్ముక్ జ‌శ్వంత్ – దీప్తి బ్రేక‌ప్ అయిపోయిన‌ట్టే… క్లారిటీ ఇదిగో…?

ష‌ణ్ముక్ జ‌శ్వంత్ – దీప్తి సున‌య‌న అస‌లు ఈ జంట‌కు సోష‌ల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. వీరు ఏం చేసినా ఓ సంచ‌ల‌న‌మే..! బిగ్‌బాస్ సీజ‌న్ 5 త‌ర్వాత ఈ ఇద్ద‌రి జంట‌కు మ‌రింత క్రేజ్ వ‌చ్చింది. యూట్యూబ్‌లో వీరికి పిచ్చ ఫాలోయింగ్ ఉంది. బిగ్‌బాస్ 5 సీజ‌న్లో స‌న్నీ విజేత‌గా నిలిస్తే.. ష‌ణ్ము ర‌న్న‌ర‌ఫ్‌గా నిలిచాడు. ఇక బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి ముందే వీరిద్ద‌రు ఫుల్లుగా ప్రేమ‌లో ఉన్నారు.

వీరు త్వ‌ర‌లోనే పెళ్లి చేసుకోబోతున్నార‌న్న ప్ర‌చారం కూడా జ‌రిగింది. ఇంత‌లోనే బిగ్‌బాస్‌లో ఛాన్స్ రావ‌డంతో ఆ నిర్ణ‌యం వాయిదా వేసుకున్నార‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్పుడు వీరిద్ద‌రి ల‌వ్ బ్రేక‌ప్ అయ్యిందా ? అంటే అవున‌నే నెటిజ‌న్లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా కామెంట్లు పెడుతున్నారు. వీరిద్ద‌రి ప్రేమ ఎంత రచ్చ చేసిందో ఇప్పుడు.. బ్రేక‌ప్ వార్త కూడా సోష‌ల్ మీడియాలో అంతే ర‌చ్చ లేపుతోంది.

బిగ్‌బాస్ హౌస్‌లో ష‌ణ్ను – సిరి మ‌ధ్య రిలేష‌న్ గురించి ఎంత ర‌చ్చ జ‌రుగుతుందో ? చూస్తూనే ఉన్నాం. ఆ ర‌చ్చ ఇంకా చ‌ల్లార‌లేదు. ఖ‌చ్చితంగా ట్రోఫీ గెలుస్తాడు అనుకున్న ష‌ణ్ము ర‌న్న‌ర‌ఫ్‌తో స‌రిపెట్టుకోవ‌డానికి కూడా సిరియే కార‌ణ‌మ‌న్న టాక్ ఉంది. ష‌ణ్ను – సిరిల మ‌ధ్య రిలేష‌న్‌తో పాటు వారు కిస్సింగ్స్‌, హ‌గ్గింగ్స్‌, వారిపై వ‌స్తోన్న వార్త‌ల‌తో ష‌ణ్ను – దీప్తి ప్రేమ బెడిసి కొట్టింద‌ని అంటున్నారు. ష‌ణ్ను – సిరి వ్య‌వ‌హారంతో దీప్తి మ‌న‌స్థాపినికి గురైంద‌న్న టాక్ బ‌లంగా వినిపిస్తోంది.

ఇక దీప్తి ష‌ణ్ము ఇన్‌స్టాగ్రామ్ అక్కౌంట్‌ను డిలీట్ చేసింది. అక్క‌డితో ఆగ‌కుండా ఈ సంవ‌త్స‌రం త‌న‌కు క‌లిసి రాలేద‌ని.. అయినా చాలా నేర్చుకున్నాను అని.. క‌నీసం మ‌న‌సాక్షితో అయినా నిజాయితీగా ఉండు.. నా చుట్టూ ఉన్న ప‌రిస్థితులు ప్ర‌తికూలంగా ఉన్నా కూడా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నా… అంటూ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకు వ‌చ్చింది. దీంతో ష‌ణ్ను – దీప్తి బ్రేక‌ప్ వార్త‌ల‌కు మ‌రింత బ‌లం చేకూర్చిన‌ట్టు అయ్యింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news