Moviesనాగ‌చైత‌న్య - స‌మంత విడాకుల‌పై సీనియ‌ర్ న‌టి కామెంట్స్‌

నాగ‌చైత‌న్య – స‌మంత విడాకుల‌పై సీనియ‌ర్ న‌టి కామెంట్స్‌

టాలీవుడ్ లో ప్రస్తుతం సీనియర్ నటిమణుల రాజ్యం నడుస్తుంది. ఒకప్పుడు హీరోయిన్లుగా వెండితెర మీద ఓ వెలుగు వెలిగిన‌ వారంతా ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో గ్రాండ్ గా రీ ఎంట్రీ ఇచ్చి వెండితెరమీద క్యారెక్టర్లతో దూసుకుపోతున్నారు. నదియా – జయసుధ – రమ్యకృష్ణ – స్నేహ లాంటి వాళ్లు ఇప్పుడు యంగ్ హీరో హీరోయిన్లకు అత్త, తల్లి, అక్క పాత్రలో కనిపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే రాజశ్రీ నాయర్ కూడా ఒకరు. ఇటీవల రాజశ్రీ నాయర్ కు పెద్ద సినిమాల్లో కీలక పాత్రలో నటించే అవకాశాలు వస్తున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్టీఆర్ – బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ద‌మ్ము సినిమాలో తనకు మంచి పాత్ర వచ్చిందని చెప్పారు.

ఆ సినిమాలో చెప్పిన రెండు డైలాగ్ ల‌ను కూడా ఎడిటింగ్‌లో తీసేసారు అని చెప్పారు. అయితే ఎడిటింగ్ లో ఎవరైనా నటించిన సీన్లను ఒక్కోసారి తొలగిస్తూ ఉంటారని కూడా రాజశ్రీ చెప్పారు. రెండున్నర గంటలకు సినిమాకోసం చాలా సీన్లు షూట్ చేస్తారని.. అయితే ఫైనల్ గా రన్ టైం ఫిక్స్ చేసినప్పుడు మనం నటించిన అన్ని సీన్లు సినిమాలో ఉంటాయో ? లేదో చెప్పలేమ‌ని రాజశ్రీ పేర్కొన్నారు. తాను ఇటీవల నటించిన కొన్ని పాత్రలు క్లిక్ కాలేదని… మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా తనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది అని చెప్పారు.

నాగచైతన్య – సమంత జంటగా కలిసి చేసిన మజిలీ సినిమాలో కూడా తాను పని చేశానని రాజశ్రీ నాయర్ తెలిపారు. ఆ సినిమా షూటింగ్ సమయానికి వారికి రీసెంట్‌గా మ్యారేజ్ అయిందని… నాగచైతన్య ప్రస్తుతం నటిస్తున్న బంగార్రాజు సినిమాలో కూడా తన చేస్తున్నానని తెలిపారు. నాగచైతన్య స్వీట్ హార్ట్ ఉన్న వ్యక్తి అని చెప్పిన ఆమె… మజిలీ సినిమాలో కలిసి పనిచేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు. చైతన్య – సమంత విడాకుల విష‌యం తెలిసి తాను ఫీల్ అయ్యాను అని వెల్లడించారు.

ఇక నేచురల్ స్టార్ నాని గురించి రాజ‌శ్రీ మాట్లాడుతూ తాను ఎప్పుడూ నటించే సీన్ల‌ గురించి మాత్రమే ఆలోచిస్తాడు అని… ఆ సీన్ లు ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్నదే నాని మదిలో మెదులుతూ ఉంటుందని చెప్పారు. ఇక ఇటీవల రాజ‌శ్రీ ఎక్కువగా అమ్మ పాత్ర‌ల్లో కనిపిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news