MoviesRRR ట్రైలర్: వామ్మో ఇంత అరాచ‌కం ఏంది సామీ... అరాచ‌కం అమ్మ...

RRR ట్రైలర్: వామ్మో ఇంత అరాచ‌కం ఏంది సామీ… అరాచ‌కం అమ్మ మొగుడే ( వీడియో)

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్లో తెర‌కెక్కిన ఆర్ ఆర్ ఆర్ సినిమా ట్రైల‌ర్ ఈ రోజు రిలీజ్ అయ్యింది. బాహుబ‌లి – ది కంక్లూజ‌న్ త‌ర్వాత ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాపై దేశ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఇక ట్రైల‌ర్ కోస‌మే నెల‌లుగా ఊరిస్తూ వ‌స్తోన్న రాజ‌మౌళి ఈ రోజు ట్రైల‌ర్ ముందుగా థియేట‌ర్ల‌లో రిలీజ్ చేశారు.

సినిమాపై ఉన్న అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా ట్రైల‌ర్ క‌ట్ చేశారు. ఏదేమైనా అదిరిపోయే విజువ‌ల్ వండ‌ర్‌ను మ‌నం థియేట‌ర్ల‌లో చూడ‌బోతున్నాం అన్న‌ది అయితే ట్రైల‌ర్‌తో జ‌క్క‌న్న చెప్ప‌క‌నే చెప్పేశాడు. రామ్‌చ‌ర‌ణ్ అగ్గిపిడుగు అల్లూరిగా గ‌ర్జిస్తే.. ఎన్టీఆర్ గోండు బెబ్బులి అల్లూరి సీతారామ‌రాజుగా విజృంభించాడు. ఇద్ద‌రు మ‌హా యోధుల పోరాటం ఎలా ఉంటుంది ? వీరు బ్రిటీష‌ర్ల‌ను ఎలా ఎదుర్కొన్నారు ? అన్న లైన్ మీదే ఈ క‌థ తెర‌కెక్క‌నుంది.

ఇక 3.07 నిమిషాల ఈ ట్రైల‌ర్లో ఎన్టీఆర్ డామినేష‌న్ ఉన్న‌ట్టు స్ప‌ష్టంగా క‌నిపించింది. బ‌ల‌మైన క‌థ‌, ఎమోష‌న్‌, క‌ళ్లు చెదిరే యాక్ష‌న్‌తో ట్రైల‌ర్ క‌ట్ చేసిన తీరు చూస్తుంటే సినిమా ఎప్పుడు వ‌స్తుందా ? అన్న ఒక్క‌టే ఉత్కంఠ ఉంది. కీరవాణి బ్యాగ్రౌండ్ స్కోర్, సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ , సాయి మాధ‌వ్ డైలాగ్స్ అదిరిపోయేలా ఉన్నాయి. ఇక ఆలియా భ‌ట్‌, ఒవీలియా మోరీస్ కూడా అందంగా ఉన్నారు. ఇక డీ. పార్వ‌తి స‌మ‌ర్ప‌ణ‌లో డీవీవీ ఎంట‌ర్టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news