Moviesప్రోమోలోనే రాజ‌మౌళిని టెన్ష‌న్ పెట్టిన బాల‌య్య‌... ఎన్ని ట్విస్టులో...! (వీడియో)

ప్రోమోలోనే రాజ‌మౌళిని టెన్ష‌న్ పెట్టిన బాల‌య్య‌… ఎన్ని ట్విస్టులో…! (వీడియో)

నంద‌మూరి బాల‌కృష్ణ టాక్ షో అన్‌స్టాప‌బుల్ ఎన్డీకే షోకు తిరుగులేని క్రేజ్ వ‌స్తోంది. ఇప్ప‌టికే మూడు ఎపిసోడ్లు పూర్త‌వ్వ‌గా.. మూడింటికి అదిరిపోయే రెస్పాన్స్ వ‌చ్చింది. తాజా అన్‌స్టాప‌బుల్ ఎన్బీకే ఎపిసోడ్‌కు ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళితో పాటు సంగీత ద‌ర్శ‌కుడు కీర‌వాణి వ‌చ్చారు.

ఈ క్ర‌మంలోనే బాల‌య్య కొన్ని సంక్లిష్ట‌మైన ప్ర‌శ్న‌లే వేసి రాజ‌మౌళిని ఆడుకోవాల‌ని చూశారు. మీరు ఇంటిలిజెంట్ అని. అఛీవ‌ర్ అని తెలుసు.. ఇంకా ఎందుకు ఆ గడ్డం అని అడిగితే రాజ‌మౌళి గ‌డ్డాన్ని స‌వ‌రించుకుంటారే కానీ ఆన్స‌ర్ చెప్ప‌రు.

ఆ త‌ర్వాత మన‌ద్దిరి కాంబినేష‌న్‌లో సినిమా లేదు క‌దా… నా అభిమానులు మిమ్మ‌ల్ని బాల‌య్య‌తో ఎప్పుడు సినిమా చేస్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు క‌దా ? అన్న క్వ‌శ్చ‌న్ వేస్తే .. రాజ‌మౌళి మీసం తిప్పుకుంటాడే కాని ఆన్స‌ర్ చెప్ప‌రు. ఆ త‌ర్వాత బాల‌య్య మీతో సినిమా చేస్తే ఆ హీరోకు, ఇండస్ట్రీకి హిట్ ఇస్తారు.. త‌ర్వాత ఆ హీరో చేసిన రెండు, మూడు సినిమాలు ఫ‌స‌క్ యేగా అని ప్ర‌శ్నిస్తే రాజ‌మౌళి కేవ‌లం ఎక్స్‌ప్రెష‌న్స్ మాత్ర‌మే ఇస్తారే కాని ఆన్స‌ర్ చెప్ప‌రు. స‌మాధానాలు చెప్ప‌రేంటి రాజ‌మౌళి అని అడిగితే.. అప్పుడు రాజ‌మౌళి మీకు తెలుసు.. నాకు తెలుసు.. ఇది ప్రోమో అని.. అస‌లు ఆన్స‌ర్లు పూర్తి ఎపిసోడ్‌లో చెపుతాన‌ని రాజ‌మౌళి చిన్న ట్విస్ట్ ఇస్తారు.

ఇక ప్రోమోతోనే ఇద్ద‌రూ ఆక‌ట్టుకున్నారు. రేప‌టి రోజున ఎపిసోడ్ మొత్తం ద‌ద్ద‌రిల్లిపోయేలా ఉంది. ఇక ఆర్ ఆర్ ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉన్న రాజ‌మౌళి, కీర‌వాణితో క‌లిసి మ‌రీ ఈ టాక్ షోకు వ‌చ్చారు. మ‌రి ఈ ఎపిసోడ్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. పూర్తి షోలో బాల‌య్య మ‌రిన్ని ట్విస్టుల‌తో రాజ‌మౌళి నుంచి ఆన్స‌ర్లు రాబ‌ట్ట‌నున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news