Moviesసౌత్ హీరోలలో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించిన ఇండియన్...

సౌత్ హీరోలలో మరెవ్వరికీ సాధ్యం కాని అరుదైన ఘనత సాధించిన ఇండియన్ ప్రైడ్ హీరో ప్రభాస్..!!

బాహుబలితో ఇంటర్నేషనల్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ రేంజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాలీవుడ్ హీరోలను సైతం వెనక్కి నెట్టి క్రేజ్ సంపాదించుకుంటున్నాడు. అటు గ్లామర్ గానూ మిగతా హీరోలకు అందనంత ఎత్తులో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్‌గా బాలీవుడ్ బడా హీరోలకు తన మార్కెట్‌తో సవాల్ విసురుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్. సౌత్ నుంచి నార్త్ వెళ్లి ఇప్పటికే ఎన్నో అద్భుతమైన ఎవరికీ సాధ్యం కాని రికార్డులు క్రియేట్ చేసిన ప్రభాస్.. ఇప్పుడు మరో అరుదైన ఘనతను సాధించారు.

ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో అరుదైన ఘనత సాధించారు. ఇప్పటి వరకు సౌత్ హీరోలలో ఎవరికి సాధ్యం కాని అరుదైన ఘనత ను సాధించి ప్రభాస్ చరిత్ర సృష్టించారు. నెంబర్ వన్ సౌత్ ఏషియన్ సెలబ్రిటీగా ప్రభాస్ సెలక్ట్ అయ్యారు. యునైటెడ్ కింగ్‌డ‌మ్‌ ఈస్టర్న్ ఐ వీక్లి అనే ప్రముఖ వెబ్ సైట్ నిర్వహించిన సర్వేలో ప్రభాస్ మొదటి స్థానం సంపాదించారు. మీడియాతో పాటు సోషల్ మీడియాపై కూడా అత్యధిక ప్రభావం చూపిన టాప్ 50 మంది సౌత్ ఏషియన్ ప్రముఖులను ఈస్టర్న్ ఐ వీక్లి ఎంపిక చేయగా.. అందులో ప్రభాస్ అగ్రస్థానంలో నిలిచారు.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక ఈ అరుదైన ఫీట్ సాధించిన మొదటి ఇండియన్, సౌత్ ఇండియన్ హీరో ప్రభాస్ కావడం విశేషం. ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సిరీస్ సినిమాలు “బాహుబలి : ది బిగినింగ్” (2015), “బాహుబలి: ది కన్‌క్లూజన్” (2017) సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీతో మరింత క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇక ప్రభాస్ నటిస్తున్న ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే.. ఆయన ఏకంగా నాలుగు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. రాధా కృష్ణ రాధేశ్యామ్‌తో పాటు ప్రశాంత్ నీల్ సలార్, ఓమ్ రౌత్ ఆది పురుష్, ఇక లేటెస్ట్‌గా ప్రారంభమైన నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే. నాగ్ అశ్విన్ ప్రభాస్ కాంబినేషన్‌లో ప్యాన్ వరల్గ్ లెవల్లో వస్తున్న ఈ సినిమాను అశ్వనీదత్ 500 కోట్లకు పైగా భారీ వ్యయంతో నిర్మిస్తున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news