Moviesఈ విషయంలో మాత్రం రాజమౌళి పద్దతి అస్సలు బాగలేదు..!!

ఈ విషయంలో మాత్రం రాజమౌళి పద్దతి అస్సలు బాగలేదు..!!

రాజమౌళి.. దర్శక బాహుబలిగా పేరు పొంది ప్రపంచ వ్యాప్తంగా క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన ఈయన తెలుగు సినిమా క్రెడిట్ ని ఎవరికి అందనంమత ఆకాశానికి ఎత్తేసి ప్రపంచవ్యాప్తంగా ఒక్క బాహుబలి అనే పేరుతో సంచలనం సృష్టించిన దర్శకుడు ధీరుడు. తెలుగు సినిమా మార్కెట్ ఈ రోజు ఖండాంతరాల లో వ్యాప్తి చెందింది అంటే అది కేవలం రాజమౌళి వల్లనే అనేది జగమేరిగిన సత్యం. సినిమాలు ఎవరైనా తీస్తారు.. కానీ ప్రజలకు నచ్చే విధంగా..వాళ్ళు మెచ్చే విధంగా తీయడమే రాజమౌళి స్పెషాలిటి.

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తోన్న ఆర్ ఆర్ ఆర్ సినిమాపై దేశ వ్యాప్తంగానే కాకుండా.. ప్ర‌పంచ వ్యాప్తంగా ఎలాంటి అంచ‌నాలు ఉన్నాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. రు. 400 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కుతోన్న ఈ సినిమా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 7వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్‌లోనే ఇద్ద‌రు క్రేజీ యంగ్‌స్ట‌ర్స్ అయిన యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ – మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తొలిసారిగా క‌లిసి తెర‌పై స్క్రీన్ షేర్ చేసుకోవ‌డంతో ఆర్ ఆర్ ఆర్ పై అంచ‌నాలు మామూలుగా లేవు.

రాజ‌మౌళి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ జ‌న‌వ‌రి 7న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఇప్ప‌టికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ శరవేగంగా సాగుతున్నాయి. ఇక జ‌క్క‌న్న తన టీమ్‌తో కలిసి జెట్ స్పీడ్‌తో అన్ని ప్రాంతాల్లో ప్రెస్ మీట్‌లు పెట్టేస్తున్నాడు. ప్రమోషన్స్ పనులను చకచకా ఫినిష్ చేస్తున్న ఈయన ఓ విషయంలో మాత్రం అభిమానులను నిరాశ పెడుతున్నారు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆలియా,చరణ్,తారక్,అజయ్ దేవగణ్ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాడు కానీ ముద్దుగుమ్మ శ్రియా ను మాత్రం అసలు పట్టించుకోవడం లేదు. మరోపక్క ఆమె లీడ్ రోల్ లో చేసిన గమనం సినిమాకు మాత్రం భీబత్సమైన పబ్లిసిటీ లు చేసారు మేకర్స్.

అంతేకాదు ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కు ప్రమోషన్స్ చేస్తే ఖచ్చితంగా సినిమాకి అంతో ఇంతో ప్రాఫిట్ ఉంటుంది. కానీ జక్కనా ఆమెను మాత్రమే ఈ సినిమా ప్రమోషన్స్ కి దూరం పెట్టడం పట్ల పలువురు నెటిజన్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అసలు రాజమౌళి ఎందుకు శ్రియను ప్రమోషన్స్ కి పిలవట్లేదో అర్ధంకావట్లేదు.

Html code here! Replace this with any non empty raw html code and that's it.

Latest news